Overweight: ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటే గుండెపోటు తప్పదా.? బరువు పెరుగుతున్న వారు వీటిపై దృష్టి పెట్టాలి!
Overweight: ఆధునిక జీవనశైలి కారణంగా విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా శరీర బరువు పెరగడంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
Overweight: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలామంది అతి తొందరగా బరువు పెరుగుతున్నారు. ఎంత తొందరగా బరువు పెరుగుతున్నారో.. అంత తొందరగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. పెరుగుతున్న బరువును నియంత్రించుకో లేకపోతే తప్పనిసరిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలామంది మధుమేహంతో పాటు గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం శరీర బరువేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా శరీర బరువుని ఎంత తొందరగా నియంత్రించుకుంటే అంత మంచిది.. ప్రస్తుతం చాలామంది ఇంటి పనులు చేయడానికి కూడా అలసిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం విపరీతంగా పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యుల సలహాలను సూచనలను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగా మారే ఛాన్స్ కూడా ఉంది.
బరువు పెరగడం వల్ల వచ్చే వ్యాధులు ఇవే:
రక్తంలో చక్కెర పరిమాణాలు ఉన్నదానికంటే అధికంగా పెరగడం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం, రక్త పోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని అమెరికన్ ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
Also Read: Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట
ప్రస్తుతం చాలామందిలో నడుము పరిమాణం ఉన్నదానికంటే ఎక్కువగా పెరుగుతుంది. కొందరిలో జీన్స్ కారణంగా ఇలాంటి సమస్యలు రావచ్చు. కానీ నడుము అదే పనిగా పెరుగుకుంటూ పోతే.. కీళ్ల నొప్పులతో పాటు, తుంటిలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
శరీరం అధిక బరువు పెరగడం కారణంగా చాలామందిలో కీళ్ల నొప్పులు కూడా వస్తున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగి దాని ప్రభావం యూరిక్ యాసిడ్ పై చూపుతుంది. దీని కారణంగా తీవ్ర కీళ్ల నొప్పులతో పాటు కీళ్లలో వాపు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బరువు పెరగడం కారణంగా గురక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురక కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఇతరులకు ఇబ్బందికరంగా మారవచ్చు. కాబట్టి అధిక బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook