Papaya Juice: ఉదయాన్నే బొప్పాయి పండు రసం తాగితే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
Papaya Juice Benefits: ప్రతిరోజు బొప్పాయి పండు రసాన్ని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి, ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి ముఖ్యంగా ఈ రసం బరువు తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Papaya Juice Benefits: బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు బొప్పాయి పండుతో తయారు చేసిన రసాన్ని ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసంలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ పొట్టను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెందుతున్నారు. అంతేకాకుండా ఇందులో లభించే మూలకాలు కొలెస్ట్రాల్‌ను సైతం కరిగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా బొప్పాయితో తయారు చేసిన రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల శరీరానికి ఇతర లాభాలు కూడా కలుగుతాయి. ఆ లాభాలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
బొప్పాయిలో పపైన్ అనే జీర్ణకర ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. పపైన్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చెయ్యడానికి చాలా ప్రభావవంతంగా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బొప్పాయి పండు జ్యూస్ని తాగాల్సి ఉంటుంది.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలోని ఇన్ఫెక్షన్లను ప్రవేశించకుండా కూడా చేసేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. తరచుగా ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బొప్పాయి తో తయారు చేసిన జ్యూస్ ని తీసుకోవాలి.
3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
బొప్పాయిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
4. క్యాన్సర్‌తో పోరాడుతుంది:
బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసి క్యాన్సర్‌కు దారితీస్తాయి. బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా రక్షణ కల్పించడానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ వల్ల వచ్చే ఇతర సమస్యలను కూడా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
5. చర్మానికి మంచిది:
ప్రతిరోజు బొప్పాయి పండు రసం తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని అందంగా తయారు చేసేందుకు ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా చర్మానికి బొప్పాయి స్కిన్ మాస్క్ ను వినియోగించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే క్రమం తప్పకుండా బొప్పాయి పండు తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల కూడా ఈ చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి