COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Peanut Chikki Nutrition Facts: ప్రస్తుతం చాలా మంది స్నాక్స్‌గా చాక్లెట్స్‌ తింటున్నారు. ముఖ్యంగా పిల్లలైతే ఎక్కువగా వీటిని తిని చిన్న వయస్సులోనే పంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిజానికి చాక్లెట్స్‌కి బదులుగా ప్రతి రోజు పల్లీలతో తయారు చేసిన పట్టిలా(పల్లి చిక్కి)ను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఒకటి చొప్పున చిక్కిని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పల్లీలో ఉండే ప్రోటీన్‌ శరీర నిర్మాణానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పల్లిపట్టిలను ప్రతి రోజు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.     


పల్లిపట్టి తినడం వల్ల కలిగే ప్రధాన లాభాలు:
శక్తిని పెంచుతుంది: 

పల్లిపట్టిలో పుష్కలంగా కేలరీలు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాయామాలు చేసేవారు ప్రతి రోజు వీటిని తినడం వల్ల ఖండరాలు మెరుగుపడతాయి.


గుండె ఆరోగ్యానికి చెక్‌: 
పల్లిపట్టిలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.


రోగ నిరోధక శక్తి: 
పల్లిపట్టిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. దీంతో పాటు అనేక పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.


రక్తహీనతను తగ్గిస్తుంది: 
పల్లిపట్టిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా రక్తహీనత వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు గర్భిణీ స్త్రీలకు ఈ పల్లిపట్టిలు ఎంతగానో మేలు చేస్తాయి.  


జీర్ణక్రియ సమస్యలకు చెక్‌: 
పల్లిపట్టిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను  ఆరోగ్యంగా చేస్తుంది. దీంతో పాటు మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. 


ఎముకల దృఢత్వం కోసం:
పల్లిపట్టిలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా వాటి ఆరగడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మానసిక సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.