Peanut Milk Benefits: బర్రె, ఆవు పాలను మించిన ఈ పాలను తాగితే ఏం జరుగుతుందంటే!
Peanut Milk Benefits: పల్లీలతో తయారుచేసిన పాలను ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి మీరు తప్పక ట్రై చేయండి.
Peanut Milk Benefits: పాలన సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం పూట పాలను తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలామంది ఆవుపాలు, గేదె పాలను తీసుకుంటూ ఉంటారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం శరీరానికి మంచిదైనప్పటికీ ఈ పాలకు బదులుగా పల్లీలతో తయారు చేసిన పాలను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్, విటమిన్ ఇ, విటమిన్ బి12, మెగ్నీషియం, ఫాస్పరస్ అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఈ పాలను ప్రతిరోజు తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ప్రస్తుతం మార్కెట్లో గేదె పాలు, ఆవు పాలు కల్తీ అయిన ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. ఇలాంటి పాలన ప్రతిరోజు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే మీరు కూడా పాలకు బదులుగా పల్లీలతో తయారుచేసిన పాలను ప్రతి రోజు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలో.. ఈ పాలకు కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వేరుశనగ పాలన తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల పల్లీలను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు కప్పుల నీటిని పోసుకుని బాగా నానబెట్టాలి. వేరుశెనగలు బాగా నానిన తర్వాత మిక్సీలో వాటిని బాగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఓ కాటన్ గుడ్డలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఓ గ్లాసు పక్కన పెట్టుకొని ఆ మిశ్రమం నుంచి పాలను వేరు చేయాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పాలను ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల శరీరానికి 65 మిల్లి గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.
ఈ పల్లీలతో తయారుచేసిన పాలను ప్రతిరోజు తాగడం వల్ల నీరసం వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఎముకలు దృఢంగా తయారయ్యి ఎముకల సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ పాలను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా లో బిపి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.