Pearl Millets For Belly Fat, Weight Loss: భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారంగా బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పూర్వీకులు మాత్రం రాగులు, సజ్జలు, జొన్నలు, ఇతర ముతకధాన్యాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో వారికి అసలు బియ్యం అంటే తెలియనే తెలియదు. సజ్జలను ప్రధాన ఆహారంగా తీసుకునే రాష్ట్రాల్లో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. ఈ ముతకధాన్యాలను ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సజ్జలను ప్రతిరోజు అన్నంలా లేదా రొట్టెల అల్పాహారంలో భాగంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సులభంగా దూరమవుతాయని పూర్వీకులు చెబుతున్నారు. స‌జ్జ‌ల్లో లిగ్నిన్ అనే ఫైటో కెమిక‌ల్స్ అధిక పరిమాణాల్లో లభిస్తుంది కాబట్టి ఇది గుండెలో ఉండే రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ ను పేరుకుపోకుండా నియంత్రిస్తుంది. అంతేకాకుండా తీవ్ర గుండె జబ్బుల నుంచి సులభంగా రక్షిస్తుంది.


ఇక జీవనశైలి కారణంగా చాలామంది బయట లభించే స్ట్రీట్ ఫుడ్స్ ను విచ్చలవిడిగా తింటున్నారు దీనికి కారణంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండెకు రక్తసరఫరా ఒక్కసారిగా ఆగిపోతుంది దీని కారణంగా హార్ట్ ఎటాక్ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సజ్జలను ప్రతిరోజు అల్పాహారంలో, ప్రధాన ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే స్యాచురేటెడ్ ప్యాట్స్ చెడు కొలస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా సజ్జలను ప్రధాన ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.


అంతేకాకుండా స‌జ్జ‌ల్లో 11 గ్రాముల ఫైబ‌ర్ లభిస్తుంది. బరువు తగ్గే డైట్ లో కూడా వీటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికోసం అల్పాహారంలో సజ్జలను రవ్వగా చేసి అన్నంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు ఈ పిండితో తయారుచేసిన రోటీలను ప్రతిరోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు సీజనల్ వ్యాధుల నుంచి కూడా మన శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఆహారంలో సజ్జలను తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read:  Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?


Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook