Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Lady Fan Misbehaviour తమ తమ అభిమాన హీరోలను, హీరోయిన్లను చూసినప్పుడు ఫ్యాన్స్ కాస్త హద్దులు దాటుతుంటారు. అయితే ఇవన్నీ కొన్ని సందర్భాల్లో సెలెబ్రిటీలకు తలనొప్పిగా మారుతుంది. ఇలాంటి ఓ ఘటనే ఆదిత్య రాయ్ కపూర్‌కు ఎదురైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2023, 11:40 AM IST
  • హద్దులు దాటిన మహిళ అభిమాని
  • మహిళలైతే ఏమైనా చేయొచ్చా?
  • ఆదిత్య రాయ్ కపూర్ వీడియో వైరల్
Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Aditya Roy Kapoor Lady Fan Misbehaviour సోషల్ మీడియా వచ్చాక ప్రతీ అంశం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏది తప్పు ఏది ఒప్పు అని జనాలు చర్చించుకుంటున్నారు. మహిళలు అయితే ఒకలా, పురుషులు అయితే ఇంకోలా? మాట్లాడతారా? న్యాయం ఉంటుందా? అని నిలదీస్తుంటారు. తాజాగా ఆదిత్య రాయ్ కపూర్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది.

మామూలుగా అయితే హీరోలైనా, హీరోయిన్లైనా కూడా తమ తమ అభిమానులను నొప్పించుకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. మన బాలయ్య లాంటి వాళ్లైతే ఎడా పెడా వాయించేస్తుంటారు అది వేరే విషయం. హీరోయిన్ల విషయంలో కొంత మంది ఆకతాయిలుంటారు. ఎలాగోలా హీరోయిన్లను తాకాలని ప్రయత్నిస్తుంటారు. ఇక హీరోయిన్లను ముద్దు పెట్టుకోవాలని కొంత మంది ప్రయత్నిస్తుంటారు. మన చోటా కే నాయుడు వంటి వారు అయితే స్టేజ్ మీదే హీరోయిన్లను ముద్దాడేస్తుంటాడు. అది వేరే విషయమనుకోండి.

 

అలా హీరోయిన్ల విషయంలో అబ్బాయిలు తప్పుగా ప్రవర్తిస్తే సోషల్ మీడియా, ఈ సమాజం అతడిని చిన్న చూపు చూస్తుంటాయి. తుంటరి, ఆకతాయి అని ముద్ర వేస్తారు. అదే హీరో విషయంలో ఓ మహిళ అభిమాని అలా చేస్తే మాత్రం ఎవ్వరూ నోరు మెదపరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తప్పు ఎవరు చేసినా తప్పే అని జనాలు అంటున్నారు.

తాజాగా ఆదిత్య రాయ్ కపూర్ విషయంలో ఓ లేడీ ఫ్యాన్ కాస్త హద్దులు దాటింది. ఆ ఆంటీ తన అభిమాన హీరోకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఒక్క ముద్దు అంటూ హీరోను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆదిత్య రాయ్ కపూర్ మాత్రం సున్నితంగా, నవ్వుతూ ఆ ఆంటీని వద్దని వారించాడు. దీంతో ఆ ఆంటీ మీద జనాలు ఫైర్ అవుతున్నారు. ఇది మీకు న్యాయంగా ఉందా? అలా ఎవరైనా సెలెబ్రిటీలను ఇబ్బంది పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆషికి 2 సినిమాతో ఎంతో ఫేమస్ అయ్యాడు ఆదిత్య రాయ్ కపూర్. లవర్ బాయ్‌గా లేడీ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత ఓకే జాను సినిమాతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇంత వరకు మరో హిట్ సినిమాను అందించలేకపోయాడు.

Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు

Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x