Vaccine Antibodies: వ్యాక్సిన్ ప్రభావం అప్పుడే తగ్గిపోతోందా..యాంటీబాడీలు తగ్గిపోతుండటం దేనికి నిదర్శనం..ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో వచ్చే కొత్త వేరియంట్లను వ్యాక్సిన్ ఎదుర్కోగలదా. ఇప్పుడీ ప్రశ్నలే వేధిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ వ్యాక్సిన్ బ్రాండ్ల విషయంలో జరిపిన తాజా అధ్యయనం ఆందోళన కల్గిస్తోంది.పైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల(Pfizer-Astrazeneca Vaccines) కారణంగా శరీరరంలో ఏర్పడిన యాంటీబాడీలు పది వారాల వ్యవధిలో 50 శాతానికి పడిపోతున్నట్టు తేలింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తరువాత కూడా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు యూకేలో జరిపిన పరిశోధన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలక్రమేణా యాంటీబాడీలు(Antibodies)తగ్గుతుంటే..కొత్త వేరియంట్లను ఎదుర్కోవడంలో సమస్య తలెత్తవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు బూస్టర్ డోసు ఆవశ్యకత కన్పిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 


ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్(Astrazeneca vaccine) తీసుకున్న 6 వందలమందిపై ఈ ప్రయోగాలు చేసినట్టు యూసీఎల్ పరిశోధకులు తెలిపారు. ఇందులో 18 ఏళ్లుపైబడిన వయస్సువారున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో రోజులు గడిచే కొద్దీ యాంటీబాడీలు అంటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోతున్నట్టు గమనించారు. పైజర్ వ్యాక్సిన్(Pfizer vaccine) అయితే 21-41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్ ప్రతి మిల్లీలీటర్‌కు 7 వేల 506 యూనిట్లకు తగ్గగా..70 రోజులు దాటేటప్పటికి 3 వేల 320 యూనిట్లకు పడిపోయాయి. అదే ఆస్ట్రాజెనెకా విషయంలో 20 రోజుల్లోపు 1201 యూనిట్లకు తగ్గగా..70 రోజులు దాటేటప్పటికి 190కి పడిపోయాయి. అంటే 5 రెట్ల వేగంతో యాంటీబాడీలు తగ్గడం గుర్తించారు. 


Also read: Vaccine Booster Dose: కొత్త వేరియంట్ల నుంచి రక్షణకు..బూస్టర్ డోసు అవసరమే