Phlegm: శీతాకాలంలో చాలా మంది కఫం సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే  ఒక బవుల్‌లో అర టీ స్పూన్  ప‌సుపులో  ఒక టీ స్పూన్ తేనెను వేసి పేస్ట్‌ చేసుకోవాలి. దీనిని నాలుకపై పెట్టి చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా గొంతులో ఉండే వైర‌స్, బ్యాక్టీరియాల‌ను తొలగించవచ్చు. ఈ  పేస్ట్‌ తీసుకున్న వారు ఒక గంట పాటు నీళ్లు తగ్గకుండా ఉండాలి.  అంతేకాకుండా కొందరు దగ్గు సమస్యతో బాధపడుతుంటారు.  అలాంటి వారు  రెండు మిరియాల‌ను నోట్లో వేసుకుని  న‌ములుతూ ర‌సాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వల్ల ద‌గ్గు త‌గ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా మూడు నుండి నాలుగు రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్యల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లం టీ: దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే అల్లం టీ మేలు కలిగిస్తుంది. అల్లం సారం తాగడం వల్ల కఫం బయటకు వస్తుంది.  శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తే కాస్త అల్లం టీ తాగండి.


వెల్లుల్లి: చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను వెల్లుల్లితో పరిష్కరించుకోవచ్చు. కఫం బయటకు రాకపోతే వెల్లుల్లి తినండి. పచ్చి వెల్లుల్లి తినడం, నీళ్లు తాగడం వల్ల కఫం కరిగిపోతుంది.


యాలకులు: యాలకులు చలికాలంలో జలుబు, దగ్గుకు మంచి జరుగుతుంది . యాలకులను వేడి నీటిలో వేసి తాగడం వల్ల కఫం సమస్య పరిష్కారం అవుతుంది.


పుదీనా: పుదీనా ఆకుల ద్వారా  కఫాన్ని కరిగించడంలో సహాయపడతాయి. పుదీనా ఆకులను బాగా కడిగి నీళ్లలో వేసి మరిగించి నిమ్మరసం కలుపుకుని తాగాలి.


 


Also Read: Flours For Weight Loss: ఈ 4 పిండ్లతో తయారుచేసిన ఆహారాలు తింటే 7 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి