Lung Infections: పావురాలు ప్రేమకు ప్రతీక అని సినిమాల్లో చూసి చూసి జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు. ఒకప్పుడు పావురాలని పెద్ద ఎత్తున పెంచే వారట. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వార్తలు చేరవేయడానికి వీటిని దూతలుగా వాడేవారు. అయితే క్రమంగా ఈ ప్రక్రియ మరుగున పడడంతో పావురాల పెంపకం కూడా బాగా తగ్గిపోయింది. అయితే పావురాలు ఎక్కువగా మన ఇళ్ల దగ్గర గూళ్ళు కట్టుకొని నివసించడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి మనం చాలా వరకు అలవాటు పడిపోయాం. అయితే పావురాల వల్ల మనకు ఎంతో హాని జరుగుతుంది అన్న విషయం మీకు తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా ఎవరికి హాని కలిగించని పావురాలు.. తెలియకుండా మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. మనలో చాలామందికి వీటి గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి మనం ఇటువంటి విషయాలను పట్టించుకోము. అయితే పావురాలు ఎక్కువగా ఇంటిలో ఉండడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇవి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉందట.


పావురాలపై జరిపిన పలు రకాల పరిశోధనలో.. పావురాల మలమూత్రాలు.. ఈకలు.. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బ్యాక్టీరియా మనుషులకు హానికరమని తేలింది. పైగా పావురం మలం పొడి రూపంలో గాలిలో సులభంగా వ్యాపించే విధంగా ఉంటుంది. ఇది పొరపాటున మన శరీరంలోకి ప్రవేశిస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు పలు రకాల అలర్జీలు ఉత్పన్నమవుతాయి. పావురాలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఉండే వాళ్ళకి కొంతకాలానికి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.


అంతేకాకుండా వాస్తు ప్రకారం కూడా ఇంట్లో పావురాల గూడు పెట్టడం అశుభంగా పరిగణిస్తారు. మనకు తెలియకుండా బయట సన్షేడ్స్ పై పెట్టిన ఏసీ అవుట్ లెట్ దగ్గర…లేక మిద్ది పైన ట్యాంకు వెనక.. ఇలా ఎక్కడపడితే అక్కడ పావురాలు తిష్ట వేస్తాయి. ముందుగా గమనించి వీటిని పరమాకపోతే అవి ఆ ప్రదేశానికి అలవాటు పడిపోతాయి. ఇప్పుడు మార్కెట్లో పిజియన్ రిప్పలెంట్  స్ప్రేస్ కూడా అమ్ముతున్నారు. వీటిని  పావురాలు తరచూ తిరిగే ప్రదేశాలలో స్ప్రే చేయడం వల్ల.. అవి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి.


పావురాలను ఇంట్లో నుంచి తరిమేమంటున్నారు.. అయ్యో పాపం అవి మూగజీవులు.. ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఇబ్బందులు కన్ఫామ్. గబ్బిలాల లాగే పావురాల వల్ల కూడా మనకు చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ పావురాలు కావు అవి.. రోగాలను పాస్ చేసే పావురాలు.కాబట్టి జాగ్రత్త వహించండి.


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 


Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు


Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook