Plums For Weight Loss: రేగు పండ్లు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అందుకే వీటి గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు. రేగు పండ్లు శివుడికి ఎంతో ఇష్టమైన పండ్లగా భావిస్తారు. అందుకే వీటిని ఎక్కువగా శివారాధనలో భాగంగా వినియోగిస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ రేగు పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ప్రతిరోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రేగుపండ్లలో ఉండే పోషకాలు:
రేగుపండ్లలో పోషకాలు పరిమాణంలో లభిస్తాయి.  అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, థయామిన్, మెగ్నీషియం, ప్రొటీన్, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం కూడా ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 


రేగుపండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బీపీ అదుపులో ఉంటుంది:

ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. రక్తపోటు పెరగడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులైన గుండెపోటు మధుమేహం వ్యాధుల బారిన  పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి రేగు పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


ఊబకాయానికి చెక్:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు డైట్ లో రేగి పనులను తీసుకోవాల్సి ఉంటుంది. అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ పండ్లు ప్రభావంతంగా సహాయపడతాయి.


జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు:
అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకోవడం కారణంగా చాలామందిలో తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా మలబద్ధకం గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించిన ఈ రేగు పనులను క్రమం తప్పకుండా తినాల్సి ఉంటుంది.


చుండ్రును నివారిస్తుంది:
రేగుపండ్లలో విటమిన్ సి, ప్రొటీన్లు, క్యారెట్‌లైడ్స్, విటమిన్ బి కాంప్లెక్స్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి వీటిని మిశ్రమంగా తయారు చేసి జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్యలకు కూడా దూరమవుతాయి. అంతే కాకుండా జుట్టు దృఢంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook