Pomegranate Benefits: కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని ప్రజలకు వైద్యనిపుణలు సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో శరీరానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి పెంచుకోవడం వల్ల కరోనా వైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారి నుంచి బయటపడవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యానికి నిధి దానిమ్మ


రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలు వివిధ సాంప్రదాయ, ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దానిమ్మ వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో దానిమ్మ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


దానిమ్మ ప్రయోజనాలు


దానిమ్మపండు తినడం వల్ల పొట్టలోని జీర్ణశక్తి బలపడుతుంది. కడుపు నొప్పి ఉన్నవారికి రోజూ దానిమ్మపండు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మలబద్ధకం, డయేరియా వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.


కండరాలను బలపరుస్తుంది..


వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దానిమ్మలో చాలా పోషకాలు ఉన్నాయి. దానిమ్మలో ప్రోటీన్, విటమిన్ - సి, ఫైబర్, విటమిన్ - కె, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. దానిమ్మ తినడం వల్ల శరీర కండరాలు బలపడి కంటి చూపు మెరుగవుతుంది.


అదుపులో రక్తపోటు


వైద్యనిపుణుల సూచన ప్రకారం.. రక్తపోటును బాలెన్సింగ్ గా ఉంచడంలో దానిమ్మ చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంది. దానిమ్మ పండు విత్తనాలను ప్రతిరోజూ తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని తెలుస్తోంది. దీంతో పాటు లోబీపీ, హైబీపీ సమస్యలను కూడా నివారించవచ్చు. 


ఊబకాయం నుంచి ఉపశమనం


దానిమ్మలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఊబకాయం, టైప్-2 మధుమేహం నుంచి ఇది శరీరాన్ని రక్షిస్తుంది. అంటే క్రమం తప్పకుండా దానిమ్మను తినే వారికి మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)     


Also Read: Glowing Skin Tips: వేసవిలోనూ కాంతివంతమైన చర్మసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!


Also Read: Sugarcane Juice Benefits: చెరుకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.