Glowing Skin Tips: వేసవిలోనూ కాంతివంతమైన చర్మసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!

Glowing Skin Tips: మరికొద్ది రోజుల్లో వేసవి రాబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగే కొద్ది చర్మం కాంతిహీనంగా మారడం జరుగుతుంది. అయితే కొన్ని డైట్ టిప్స్ పాటించడం వల్ల చర్మం కాంతివతంగా మెరిసేలా చేసుకోవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 06:15 PM IST
Glowing Skin Tips: వేసవిలోనూ కాంతివంతమైన చర్మసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!

Glowing Skin Tips: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో స్కిన్ టానింగ్, స్కిన్ రాషెస్, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అధిక చెమట కారణంగా ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో చర్మ సంరక్షణ కచ్చితంగా అవసరం. కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా చర్మాన్ని కాంతివతంగా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

మెరిసే చర్మం కోసం పాటించాల్సిన ఆహార నియమాలు..

1. పుచ్చకాయ

మెరిసే చర్మం కోసం రోజూ పుచ్చకాయ తినడం చాలా మంచిది. అందులో 90 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో ఈ చర్మం తేమతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. 

2. గ్లోయింగ్ స్కిన్ కోసం తాగునీరు

వేసవిలో నీరు ఎక్కువగా తాగడం వల్ల నీటి కొరతను దూరం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

3. దోసకాయ

దోసకాయ తీసుకోవడం వల్ల శరీరానికి తగిన వాటర్ కంటెంట్ అందుతుంది. ఇది నీటి కొరత నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. దోసకాయ తినడం వల్ల చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. 

4. మెరిసే చర్మం కోసం పెరుగు:

పెరుగులో ఫైబర్ తో పాటు అనేక ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల కడుపులో మేలు చేయడం సహా.. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)    

Also Read: Sugarcane Juice Benefits: చెరుకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Also Read: Cycling Benefits: రోజూ సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ మాయం.. మరెన్నో ప్రయోజనాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News