Sleep Disorder: శరీరంలో పొటాషియం లోపిస్తే అంత ప్రమాదకరమా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి
Potassium Deficiency: ఆరోగ్యం మహా భాగ్యమన్నారు పెద్దలు. ముమ్మాటికీ నిజమే. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే పద్ధతుల్ని పాటిస్తుండాలి. ఆరోగ్యంలో అన్నింటికంటే ముఖ్యమైంది సరైన నిద్ర. తగినంత నిద్ర లేకుంటే అన్నీ అవస్థలే..
Potassium Deficiency: మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైంది, ప్రాధాన్యత కలిగింది నిద్ర. సరైన నిద్ర ఉన్నంతవరకే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. తరచూ అదే పనిగా నిద్ర లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అసలు నిద్రలేమి సమస్యకు కారణాలేంటి, ఎలా ఉపశమనం పొందాలనే వివరాలు తెలుసుకుందాం..
పొటాషియం శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన మినరల్. నాడీ వ్యవస్తను సరి చేస్తుంది. కండరాలు కుదించకుండా..శరీరంలో లిక్విడ్ పదార్ధాల సమతుల్యతను కాపాడేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. హార్ట్ బీట్‌ను మెరుగుపర్చడం పొటాషియం చేసే అతి కీలకమైన పని. శరీరంలో పొటాషియం లోపం ఏర్పడితే మెడికల్ పరిభాషలో హైపోకలేమియాకు దారి తీస్తుంది. మనిషి శరీరంలో పొటాషియం లీటరుకు 3.6 మిల్లీమోల్స్ కంటే తక్కువైతే ఈ పరిస్థితి ఉత్పన్నమౌతుంది.
పొటాషియం లోపంతో ప్రధానంగా 5 రకాల వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముంది. డైట్‌లో తగిన పరిమాణంలో పొటాషియం లేకపోతే సహజంగానే శరీరంలో పొటాషియం లోపం ఏర్పడుతుంది. లేదా దీర్ఘకాలంగా డయేరియా, వాంతుల సమస్యలు ఉత్పన్నమైతే శరీరంలో పొటాషియం తక్కువై సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో పొటాషియం తగిన పరిమాణంలో లేకపోతే వివిధ రకాల వ్యాధుల ముప్పు ఏర్పడుతుంది.
తీవ్ర అలసట
శరీరంలో అన్ని కండరాలు, కణాలు, టిష్యూస్‌లో అవసరమైన కీలకమైన న్యూట్రియంట్ పొటాషియం. పొటాషియం తగిన పరిమాణంలో లేకుంటే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. శరీరంలోని వివిధ రకాల ప్రక్రియలపై దీని ప్రభావం పడుతుంది. పొటాషియం తక్కువైతే ఎనర్జీ ఒక్కసారిగా తగ్గిపోతుంది.
కడుపు ఉబ్బరం, మలబద్ధకం
పొటాషియం లోపముంటే ప్రేవుల్లో ఉండే కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలోని వ్యర్ధాలు బయటకు వెళ్లే ప్రక్రియ మందగిస్తుంది. ప్రేవుల్లో జీర్ణక్రియ తగ్గడం వల్ల మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు బాధిస్తాయి. అందుకే పొటాషియం తగ్గినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.
నిద్ర లేమి
ఆధునిక జీవనశైలిలో చాలామంది పొటాషియం లోపంతో బాధపడుతూ కన్పిస్తున్నారు. ఫలితంగా వ్యక్తిలో ఆందోళన ప్రధాన లక్షణంగా కన్పిస్తోంది. నిద్రపై దీని ప్రభావం పడుతుంటుంది. రాత్రి వేళ నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర లేమి లేదా ఇన్‌సోమ్నియా వ్యాధి తలెత్తుతుంది. ఇది చాలా ప్రమాదకరం. నిద్రలేమి చాలా రకాల ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది.
అధిక రక్తపోటు
శరీరంలో పొటాషియం స్థాయి తగ్గినప్పుడు బ్లడ్ ప్రషర్ పెరుగుతుంది. ప్రత్యేకించి సోడియం ఎక్కువ పరిమాణంలో తీసుకునేవారిలో. పొటాషియం అనేది రక్త నాళికల్ని రిలాక్స్ చేస్తుంది. ఫలితంగా రక్తపోటు నియంత్రణల ఉంటుంది. అందుకే పొటాషియం అత్యంత కీలకమైందిగా భావిస్తారు
హార్ట్ బీట్
హార్ట్ బీట్ అసాధారణంగా ఉంటే హైపోకైలేమియా లేదా పొటాషియం లోపమని అర్ధం చేసుకోవచ్చు. గుండె కండరాలు సంకోచ, వ్యాకోచాల ప్రక్రియలో పొటాషియంల కీలక భూమిక పోషిస్తుంది. అదే పొటాషియం పరిమాణం తగ్గితే హార్ట్ బీట్ అసాధారణంగా ఉంటుంది. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారి తీయవచ్చు.
పొటాషియం లోపముంటే ఏం తినాలి
బంగాళ దుంప, దానిమ్మ, అవకాడో, చిలకడదుంప, పాలకూర, వైట్ బీన్స్, కొబ్బరి నీళ్లు, బీట్ రూట్, సోయా బీన్స్, టొమాటో తరచూ తీసుకుంటే శరీరంలో పొటషియం కొరత తీరిపోతుంది.
Also read: Coconut Benefits: వేసవిలో కొబ్బరి దివ్యౌషధమే, రోజు తీసుకుంటే ఆ సమస్యలేవీ దరిచేరవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook