Prediabetes Symptoms: డయాబెటిస్ రాక ముందే శరీరంలో వచ్చే లక్షణాలు ఇవే.. వీటిని అస్సలు విస్మరించవద్దు!
Prediabetes Symptoms: మధుమేహం వచ్చే ముందు శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చిట్కాలు కూడా పాటించాలి.
Prediabetes Symptoms: ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సులో మధుమేహం బారిన పడుతున్నారు. శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం, తగ్గడం కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కొంతమందిలో ప్రీ-డయాబెటిస్ లక్షణాలు ఉన్నప్పటికీ మధుమేహం బారిన పడే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. అయితే శరీరంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రీ-డయాబెటిస్ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించడం వల్ల మధుమేహాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. అయితే మధుమేహం వచ్చే ముందు శరీరంలో ఏర్పడే లక్షణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మధుమేహం వచ్చే ముందు శరీరంలో అనేక లక్షణాల ఏర్పడతాయి. ముఖ్యంగా చాలా మందిలో అరచేతులతో పాటు అరికాళ్ళల్లో తీవ్ర నొప్పులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందిలో ఇతర చోట్ల నొప్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే శరీరంపై చెమట అకస్మాత్తుగా వస్తుంది. దీంతో పాటు ఆ చమట దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కొంతమందిలో మధుమేహం వచ్చే ముందు జుట్టు, గోర్లు కత్తిరించి కొన్ని రోజులకే వేగంగా పేరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. దీంతో పాటు కొందరిలో పదే పదే గొంతు ఆరిపోయి, దాహం వేస్తూ ఉంటుంది. ఇలాంటి వారు కూడా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మరికొంత మందిలో కళ్ళపై పదేపదే బూసులు వస్తూ ఉంటాయ. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహం వచ్చే ముందు చాలా చెవుల్లో కూడా వ్యర్థపదార్థాలు ఎక్కువగా పెరిగిపోతాయి. అంతేకాకుండా మరికొంతమందిలో చల్లటి నీరు త్రాగాలని లేదా తరచుగా కూల్ కలిగిన ఆహారాలు తినాలని కోరికలు కూడా పుడతాయి. అలాగే నిత్యం తిపి పదార్థాలు తినాలని కూడా కోరికలు వస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇలాంటి లక్షణాలు ఉన్నవారు జీవనశైలిలో మార్పులు, ఆహారాల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
1. ఆహార నియంత్రణ:
పోషకాహార నిపుణుడి సలహాతో, మీకు సరైన ఆహార ప్రణాళికను రూపొందించుకోవడం చాలా మంచిది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, లీన్ ప్రోటీన్ వంటి పోషకమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
చక్కెర, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించండి.
2. శారీరక శ్రమ:
రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.
నడవడం, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయడం చాలా మంచిది.
శారీరక శ్రమ స్థాయిని క్రమంగా పెంచుకోండి.
3. రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించాల్సి ఉంటుంది:
రోజుకు ఒకటి లేదా రెండుసార్లు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోండి.
డాక్టర్‌తో కలిసి రోజు వారి ఆహార పద్ధతులను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుంటే, మీ డాక్టర్ చికిత్స ప్రణాళికలో మార్పులు చేయవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి