Pregnancy Symptoms in Telugu: మనిషి పుట్టుక మహిళ గర్భం నుంచి ప్రారంభమౌతుంది. మగ ఆడ కలయిక ద్వారా సంతాన ప్రాప్తి కలగడం గర్భధారణ నుంచే మొదలవుతుంది. 9 నెలల గర్భధారణ తరువాత శిశువు బాహ్య ప్రపంచాన్ని చూస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు ఎలా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన అంశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి మహిళ మెచ్యూర్ అయిన తరువాత క్రమం తప్పకుండా నెలసరి లేదా పీరియడ్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా సమయానికి 2-3 రోజులు అటూ ఇటూ కాకుండా అసలు రాకపోతే మాత్రం ఇది ప్రెగ్నెన్సీకు తొలి సూచన అవుతుంది. అంటే నిర్ణీత పీరియడ్స్ సమయం దాటి పదిరోజులైనా నెలసరి రాకపోతే అది గర్భధారణకు సంకేతం కావచ్చు. ఇది కాకుండా కొన్ని ఇతర లక్షణాలున్నాయి.


అకారణంగా ఏ అజీర్తి సమస్య లేకుండా వాంతులు రావడం ప్రధాన లక్షణం. కొన్ని రకాల ఆహార పదార్ధాలు నచ్చకపోవడం, వికారంగా అన్పించడం, కొన్ని రకాల పదార్ధాలు అంటే పులుపు పదార్ధాలు తినాలనే కోరిక కలగడం ఇవన్నీ గర్భధారణకు లక్షణాలుగా ఉంటాయి. అందుకే గర్భిణీ స్త్రీలు పులుపుగా ఉండే మామిడి, చింత పండు వంటివి తినాలనుకోవడం గమనిస్తుంటాం. దీంతో పాటు వాసన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చాలా రకాల వాసనలకు ప్రతికూలంగా స్పందిస్తుంటారు. ఆకలి ఎక్కువగా ఉండటం లేదా అసలు ఆకలే వేయకపోవడం కూడా ఇందులో భాగమే అనుకోవాలి.


మజిల్ క్రాంప్స్, కడుపు నొప్పి కూడా ప్రెగ్నెన్సీ‌కు సంకేతాలుగా ఉంటాయి. దీనికి కారణం యుటెరస్ భాగంలో పిండం సెటిల్ అవుతున్నప్పుడు ఈ నొప్పి ఉంటుంది. అదే సమయంలో ప్రీ మెన్స్టువల్ సిండ్రోమ్, ప్రెగ్నెన్సీ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. పీఎంఎస్ లక్షణాలు 4-5 రోజుల్లో తగ్గిపోగా..ఎక్కువకాలం ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీగా సందేహించాల్సి వస్తుంది. ఇవన్నీ హార్మోనల్ మార్పుల వల్ల వస్తుంటాయి.


మహిళల స్తనభాగం చాలా సెన్సిటివ్‌గా మారుతుంది. తాకితే చాలు నొప్పిగా అన్పిస్తుంది.  నిపుల్ చుట్టూ రంగు మారడం మరో సంకేతం. శరీరంలోని ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మహిళలకు తరచూ మూత్రానికి వెళ్తుంటే మాత్రం కచ్చితంగా ప్రెగ్నెన్సీ లక్షణంగా భావించాల్సిందే. 


వెజైనల్ డిశ్చార్చ్ అంటే వైట్ డిశ్చార్జ్ చిక్కగా ఉందంటే ప్రెగ్నెన్సీ లక్షణం అవుతుంది. సాధారణ సమయాల్లో ఇది పల్చగా ఉంటుంది. ఇక వారం పదిరోజులు శరీరం సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే గర్భధారణ సంకేతం కావచ్చు. అయితే ఈ లక్షణం అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. 


Also read: Vitamin B12 Foods: విటమిన్ బి12 పుష్కలంగా లభించే 5 పదార్ధాలు రోజూ తింటే చాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook