Vitamin B12 Foods: విటమిన్ బి12 పుష్కలంగా లభించే 5 పదార్ధాలు రోజూ తింటే చాలు

Vitamin B12 Foods: శరీర నిర్మాణం, ఎదుగుదలకు విటమిన్ బి12 చాలా అవసరం. శరీరంలో విటమిన్ బి12 లోపముంటే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. విటమిన్ బి12 లోపముంటే..తరచూ అలసట, ఎనర్జీ లేకపోవడం, తలనొప్పి, బలహీనత వంటివి బాధిస్తుంటాయి. 

అయితే విటమిన్ బి12 లోపముందని చింతించాల్సిన అవసరం లేదు. శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించేందుకు సులభమైన పద్థతున్నాయి. డైట్‌ లో కొన్ని ఆహార పదార్ధాలను చేరిస్తే విటమిన్ బి12 కావల్సినంత అందుతుంది. విటమిన్ బి12 పుష్కలంగా లభించే 5 పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

పాలకూర ఆకుకూరల్లో పాలకూర స్థానం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. కారణం ఇందులో పోషక విలువలు చాలా ఉన్నాయి. శాకాహారులకు పాలకూర ఓ ఎనర్జీ హౌస్ అనడంలో అతిశయోక్తి ఉండదు. పాలకూరలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

2 /5

సోయా బీన్స్ సోయాబీన్స్ అనేవి ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పదార్ధం. వాటితో పాటు విటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటుంది. 

3 /5

మష్రూమ్స్ మష్రూమ్ లేదా పుట్టగొడుగుల్లో పోషక పదార్ధాలు చాలా ఎక్కువ. విటమిన్ బి12 కావల్సినంతగా లభిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్ బి12 లోపం ఉండదు.

4 /5

ఆవు పాలు ఆవుపాలను కంప్లీట్ ఫుడ్‌గా పిలవచ్చు. ఇందులో విటమిన్ బి12తో పాటు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ప్రోటీన్లు ఉంటాయి. రోజూ ఒక గ్లాసు ఆవు పాలు తాగితే శరీరానికి కావల్సిన విటమిన్ బి12 ఇతర పోషకాలు లభిస్తాయి. వివిధ రకాల వ్యాధుల్నించి సంరక్షించుకోవచ్చు.

5 /5

బీట్‌రూట్ బీట్‌రూట్‌లో విటమిన్ బి12 పుష్కలంగా ఉండటమే కాకుండా ఐరన్, పొటాషియం, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. అదే సమయంలో చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్‌ను నేరుగా లేకపోయినా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.