Prevent Fungal Infections in Monsoon: కేవలం ఎండకాలం మాత్రమే కాదు, వర్షాకాలంలో కూడా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో దురదలు కూడా విపరీతం అవుతాయి. వాతావరణంలో మాయిశ్చర్‌ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. తరచూ జలుబు, దగ్గు వంటి రోగాల బారిన పడతారు. దీంతో స్కిన్‌ సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్లో విపరీతంగా రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. నీటి వల్ల కూడా రోగాల వస్తాయి. ముఖ్యంగా మలేరియా, డెంగీ, చికన్‌గూన్య ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం పుష్కలంగా ఉంటుంది. అయితే, మారుతున్న సీజన్లలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఓ 5 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సీజన్లో ఇన్పెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఫంగల్‌, బ్యాక్టిరియా బారిన పడతారు. దీనికి కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.


వేప..
వేపలో మెడిసినల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పంటి సంబంధిత సమస్యలను కూడా మన దరిచేరకుండా చేస్తుంది. ముఖ్యంగా వేపలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌, ఇమ్యూనిటీ బూస్టింగ్‌ ఇస్తుంది. అంతేకాదు వేపలో ఉండే యాంటీ ఏజింగ్‌ గుణాలు కూడా ఉంటాయి. ఇది మన చర్మ, జుట్టుకు అనేక లాభాలు ఉన్నాయి. యూవీ కిరణాల నుంచి ముఖం డ్యామేజ్‌ కాకుండా రేడియేషన్‌ నుంచి కాపాడతాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ మారుతున్న సీజన్లో వేపను ఉపయోగించడం వల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.


ఇదీ చదవండి: ప్రతిరోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే మీ శరీరంలో జరిగే అద్బుతం ఇదే..


కొబ్బరినూనె..
కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు కలిగి ఉంటాయి. కొబ్బరి నూనె మారుతున్న సీజన్లో వచ్చే రింగ్‌ వార్మ్స్‌ను కూడా ప్రభావవంతంగా నివారిస్తుంది. ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు దారితీయకుండా కొబ్బరి నూనె ఉపయోపడుతుంది.


తేనె..
తేనె కూడా ఫంగల్‌ ఇన్పెక్షన్ల బారిన పడకుండా కాపాడే ఎఫెక్టీవ్‌ రెమిడీ. తేనెలో హైడ్రోజన్‌ పెరోక్సైడ్‌ ఉంటుంది. ఇది ఫంగీ, బ్యాక్టిరియాను సమర్థవంతంగా నివారిస్తుంది. తేనె తీయ్యగా ఉండటమే కాకుండా ఇందులో విటమిన్స్‌, మినరల్స్‌, ఐరన్, జింక్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. తేనె ఇన్పెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. అంతేకాదు తేనె  మెటబాలిక్‌ సిండ్రోమ్‌కు వ్యతిరేకంా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడుతుంది.


కలబంద..
కలబందలో యాంటీ బ్యాక్టిరియల్‌,యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. కలబందలో అనేక ఆరోగ్య సమస్యలకు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. కలబంద స్కిన్ కేర్‌, హెయిర్‌ కేర్‌ రోటీన్లో చేర్చుకోవడం వల్ల చర్మంపై వచ్చే దురదలు, రింగ్‌వార్మ్స్‌ సమస్యకు వ్యతిరేకంగా పోరాడుతుంది.


ఇదీ చదవండి: పళ్లు, చిగుళ్ల ఆరోగ్యానికి ఈ ఆహారాలు తినండి.. హెల్తీగా మిళమిళ లాడుతాయి..


టీ ట్రీ ఆయిల్‌..
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఈ ఎసెన్షియల్‌  ఆయిల్‌ మీ శరీరానికి అప్లై చేయడం వల్ల యాంటీ ఫంగల్‌ గుణాలు కలిగి ఉంటుంది. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter