Pudina Health Benefits: జీర్ణక్రియ నుంచి రక్త ప్రసరణ వరకూ..పుదీనాతో అద్భుత ప్రయోజనాలు
Pudina Health Benefits: పుదీనా ఆకులు సర్వ ఔషధ గుణాలకు పెట్టింది పేరు. ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా కన్పించే పుదీనా ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వింటే..ఇక జీవితంలో వదిలిపెట్టరు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Pudina Health Benefits: పుదీనా ఆకులు సర్వ ఔషధ గుణాలకు పెట్టింది పేరు. ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా కన్పించే పుదీనా ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వింటే..ఇక జీవితంలో వదిలిపెట్టరు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
మింట్‌గా పిల్చుకునే పుదీనాతో నిజంగానే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుదీనాలో ఉన్నన్ని ఔషధ గుణాలు మరెందులోనూ లేవంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు అధికం కాబట్టే ప్రతి భారతీయ వంటలో సాధారణంగా కన్పిస్తుంటుంది.
నాన్ వెజ్ కావచ్చు..వెజ్ కావచ్చు. వంట ఏదైనా సరే పుదీనా భారతీయ వంటల్లో తరచూ వాడుతుంటారు. అందుకే ప్రతి వంటింట్లో కామన్‌గా లభ్యమవుతుంది. వండే వంటలకు అదనపు ఫ్లేవర్ అందిస్తుంది. అంతేకాదు పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చాలా రకాల రుగ్మతలు పుదీనాతో దూరమవుతాయి. పుదీనాతో ఏ విధమైన ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయో చూద్దాం.
జీర్ణక్రియకు..రక్త ప్రసరణకు
పుదీనాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి గానీ కొవ్వు పదార్ధాలు మాత్రం ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, డీ, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు చర్మానికి ఆరోగ్యాన్నిస్తాయి. అంతేకాకుండా పుదీనాలో అధిక మోతాదులో ఉండే ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటివి శరీరంలో రక్త శాతం పెంచడం, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. పుదీనా తరచూ తీసుకోవడం ద్వారా ఆస్తమాను కూడా నియంత్రించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
ఒత్తిడిని దూరం చేసేదిగా
పుదీనాలో ప్రధానంగా కన్పించేది మెంథాల్. అందుకే మింట్ లీవ్స్‌గా పిలుస్తారు. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పుదీనా రసం రాసి..మసాజ్ చేసుకుంటే ప్రయోజనముంటుంది. పుదీనాతో అరోమా థెరపీ కూడా ఉంది. అంటే పుదీనా వాసన చూడటం ద్వారా ఒత్తిడి దూరం చేసుకోవచ్చనేది తాజా పరిశోధనలో తేలింది. మెదడులోని కార్టిసాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా విశ్రాంతి ఇస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. పుదీనాతో బరువు కూడా తగ్గుతుందట. పుదీనాలో ఉండే ఆమ్లాలు జీర్ణ ప్రక్రియను సక్రమం చేస్తుంది. ఫలితంగా సహజసిద్ధంగానే బరువు తగ్గవచ్చు. పుదీనాను ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యపర ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.
Also read: Summer Foods: వేసవిలో ఈ 5 రకాల ఆహారాలను తింటే వేడి నుంచి ఉపశమనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook