Ragi Flour For Diabetes: ప్రస్తుతం మధుమేహం సమస్య ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారింది. అయితే  ఈ వ్యాధికి ఇంకా ఏలాంటి ఔషధాలు కనిపెట్టలేరు. కావున ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో కొన్ని రకాల ఔషధాలున్న ఇవి వ్యాధిపై ఏలాంటి ప్రభావం చూపలేకపోతోంది. అయితే రక్తంలో చక్కెర నియంత్రణ లేకపోతే ఇది తీవ్ర వ్యాధిగా మారి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద నిపుణులు పలు రకాల ఇంటి చిట్కాలను పాటించమని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాగి పిండి వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా..?


ప్రస్తుతం చాలా మంది రోజూ తిసుకునే ఆహారంలో గోధుమ పిండితో చేసిన పదార్థాలను అధికంగా తింటూ ఉంటారు. అయితే మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా గోధుమ పిండికి బదులుగా రాగి పిండిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో మధుమేహం మాత్రమే కాదు.. ఊబకాయం, అధిక రక్తపోటు (హై బీపీ) అన్ని వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ తిసుకునే ఆహారంలో ఈ పిండితో చేసిన ఆహారాన్ని తీసుకోవాలిని నిపుణులు పేర్కొన్నారు.


డయాబెటిస్‌ వ్యాధి ఉన్నవారికి రాగి పిండితో చేసిన పదార్థాలు ఎలా ఉపయోగపడతాయి..?


రాగి పిండితో చేసిన పదార్థాలలో  అనేక రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఏ ఆహారాలు తిన్న అవి అజీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాని ఈ పిండితో చేసిన పదార్థాలను తింటే జీర్ణసమస్యలు తొలగిపోవడమే కాకుండా జీర్ణక్రియ బలపడుతుంది. కావున శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది.


రాగుల్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ డి, ఐరన్(Protein, Calcium, Vitamin D, Iron) కూడా సమృద్ధిగా లభ్యమవుతాయి. షుగర్ లెవల్స్‌ అదుపులోకి రావడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే గుణాలు ఎముకలను దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. అయితే ఈ పిండితో చేసిన పదార్థాలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రక్తాన్ని కోరత లేకుండా చేస్తాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!  


Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!  



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook