Lion Video: చాలా ఏళ్ల తర్వాత కనబడడంతో.. మహిళను హత్తుకున్న రెండు సింహాలు! వీడియో చూస్తే షాకే

Two Lions hug and Kisses Switzerland Woman. సింహాన్ని మనం దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి రెండు సింహాలు  ఓ మహిళను ప్రేమగా హత్తుకుని ముద్దులు పెట్టాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 12, 2022, 07:14 PM IST
  • మహిళకు ముద్దులు ఇచ్చిన రెండు సింహాలు
  • వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు
  • అవుదుల్లేని ప్రేమ
Lion Video: చాలా ఏళ్ల తర్వాత కనబడడంతో.. మహిళను హత్తుకున్న రెండు సింహాలు! వీడియో చూస్తే షాకే

Two Lions hug and Kisses Switzerland Woman: 'సింహం' అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు అన్న విషయం తెలిసిందే. సింహం బలం, ధైర్యం అంతాఇంతా కాదు. అడవిలో దాని ముందు ఏ ఇతర జంతువు నిలబడలేదు. ఎంతో చురుకుగా ఉండే సింహంకు 'అడవి రాజు' అనే బిరుదు కూడా ఉంది. అలాంటి సింహాన్ని మనం దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక అది మనవైపు చూసిందంటే వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకుంటాం. అలాంటి రెండు సింహాలు  ఓ మహిళను ప్రేమగా హత్తుకుని ముద్దులు పెట్టాయి. 

సింహాలు మహిళను ప్రేమగా హత్తుకోవడం ఏంటి.. ముద్దులు పెట్టడం ఏంటి అను అనుకుంటున్నారా?. నిజమే.. స్విట్జర్లాండ్‌లోని ఓ జూలో ఉండే రెండు సింహాలు తన యజమానిని చూడగానే పరుగెట్టుకుంటూ వచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని మహిళ 7 సంవత్సరాల క్రితం రెండు సింహాలను పెంచింది. వాటిని ప్రతిరోజు ఎంతో అపురూపంగా చూసుకునేది. రెండు సింహాలతో ఆటలు కూడా ఆదుకునేది. అయితే సింహాలు ఇంట్లో ఉండడం హానికరం అని జూ సిబ్బంది వాటిని తీసుకెళ్లారు.

7 సంవత్సరాల తర్వాత ఆ మహిళ జూను సందర్శించడానికి వెళ్లింది. రెండు సింహాలు ఉండే చోటుకు ఆమె వెళ్లగానే.. అవి తన యజమానిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చాయి. సెక్యూరిటీ కంచెపై నుంచే మహిళను తమ ముందు కాళ్లతో హత్తుకుని తమ ప్రేమను చూపించాయి. అందులో ఓ సింహం అయితే తన యజమానిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. రెండు ఒకేసారి ఆమె మీద పడినా వాటి బరువును మోస్తూ.. సంతోషం వ్యక్తం చేసింది. 

రెండు సింహాలు మహిళను ప్రేమగా హత్తుకున్న వీడియోను తార్క్ సాహిత్య అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకి 71 వేల మంది లైక్ చేయగా.. 10.7 మంది రీట్వీట్ చేసారు. మరోవైపు కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అవుదుల్లేని ప్రేమ', 'ఈ భూ గ్రహం మీద మనుషులు చెత్త జీవులు', 'హార్ట్ వార్మింగ్ వీడియో' అంటూ కెమెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Shani Gochar 2022: మకర రాశిలోకి శని గ్రహం.. 6 నెలల పాటు ఈ 3 రాశుల వారికి కష్టాలే!

Also Read: Relationship Tips: కాబోయే భార్యను తొలిసారి కలవబోతున్నారా... అయితే ఈ టిప్స్ మీకోసమే...

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News