Ragi Roti Benefits: ఇది ఎండకాలం ఉదయం రాగి అంబలి తాగి పనులకు వెళ్తే రోజంతా శక్తినిస్తుంది. రాగి కడుపులో చల్లదానన్నిస్తుంది. ఎండవేడిమిని తట్టుకునే శక్తినిస్తుంది. ముఖ్యంగా రాగులను ఎండకాలం మన డైట్లో చేర్చుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండొచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన అందరి ఇళ్లలో సులభంగా తయారు చేసుకునేది గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలు. ఇక మరింత శక్తి పొందాలంటే జొన్న, సజ్జలతో తయారు చేసిన రొట్టెలను కూడా తయారు చేసుకుంటాం. అయితే, రాగిపిండి అంబలి, రాగి ముద్దగా మాత్రమేకాదు రాగి రొట్టెలు కూడా తయారు చేసుకోవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి రాగిరొట్టె ఎంతో ఆరోగ్యకరం. ఈ కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇది ఫ్యామిలీ హిస్టరీ కారణం కావచ్చు. లేదా సరైన జీవనశైలి నియమాలు పాటించకపోవడం కూడా కావచ్చు. అయితే, ఇలా షుగర్ తో బాధపడేవారిని అన్నం తక్కువ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.దీంతో వారు జొన్నలు, గోధుమలతో చేసిన రొట్టెలను తింటారు. రాగులతో తయారు చేసిన రొట్టెలో తింటే మరింత ఆరోగ్యకరం. ఇందులోని తక్కువ మొత్తం కార్బొహైడ్రేట్స్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడతాయి.  మధుమేహంతో బాధపడేవారు రాగిపిండి రొట్టెలను తింటే వారికి తక్షణ శక్తి కూడా వస్తుంది.


ఇదీ చదవండి:  పచ్చిఅరటికాయ 5 ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటూనే ఉంటారు..


ఇందులోని ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కల్పిస్తుంది. దీంతో మళ్లీమళ్లీ ఆకలి వేయదు. రాగిపిండిలోని ఫైబర్ మలబద్ధకం సమస్యను రాకుండా సహాయపడుతుంది. దీంతో పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు రాగిపిండిలో యాంటీ డయాబెటిక్ మందుగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. రాగిపిండితో తయారు చేసిన రొట్టెలో మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఇది మధుమేహంతో బాధపడేవారికి మంచి మందు. గోధుమల కంటే రాగిపిండిలో తక్కువ గ్లైసెమిక్ సూచి ఉంటుంది. ఇది మధుమేహులకు మంచిది.


ఇదీ చదవండి: కామెర్లను నయం చేసే శక్తి ఈ ఎర్రటి పండుకు ఉంది.. అదేంటో తెలుసా?


ముఖ్యంగా రాగిపిండి చక్కెరను రక్తంలో త్వరగా శోషించదు. అంతేకాదు ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది.  చక్కెర స్థాయిలను పెరగనివ్వకుండా కాపాడుతుంది. రాగిపిండితో తయారు చేసిన రోటీలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. రాగిపిండిలోని ఫైబర్ మెల్లిగా కరుగుతుంది. దీంతో డయాబెటిస్‌తో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగవు.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter