Benefits Of Ragi Java And Oats: మనలో చాలా మంది ఉద‌యం పూట ఇడ్లీ, దోశ వంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. దీని వల్ల బరువు, గ్యాస్‌ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా పాలల్లో ఓట్స్ ను క‌లిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కొంతమంది రాగి జావను కూడా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోకి ఎక్కువ ఉప్పు, నూనె, మ‌సాలా వంటి ప‌దార్థాలు వెళ్ల‌కుండా ఉంటాయి.  అయితే ప్రతిరోజు ఓట్స్‌, రాగి జావ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిరోజు ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలను తీసుకోవడం వల్ల శరీరం బద్దకంగా మారుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనికి బదులుగా ఓట్స్,రాగి తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా ఓట్స్‌ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 


ఇతర అల్పాహారాల‌ను తీసుకోవ‌డం వల్ల ర‌క్తంలో షుగర్ లెవల్స్‌ పెరుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌ను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా రాగి జావను తీసుకోవడం వల్ల ఐరన్ వంటి ఇతర పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయి. రాగి జావ షుగర్‌ను కంట్రోల్‌ చేయడంలో ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  


Also Read Saunf Seeds Benefits: సోంపు గింజలతో సులువుగా బరువు తగ్గండి ఇలా !


అధిక బరువుతో బాధపడుతున్నవారు ఈ ఓట్స్‌ , రాగి జావ తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్‌, మలబద్దం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఓట్స్‌ లేదా రాగి జావను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  ఓట్స్‌తో పాటు మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు.  


రాగి జావలో అధిక శాతం కార్బోహైడ్రేట్సక్ ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబ‌కాయం, కొలెస్ట్రాల్, షుగ‌ర్ వంటి అనారోగ్య స‌మస్య‌లు త‌లెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని మధ్యాహ్నం లేద భోజనం తరువాత అల్పాహారాల భాగంలో తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.   ఓట్స్, రాగిజావ మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి వీటిని రోజూ తీసుకోవ‌డం అంత మంచిది కాద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.


Also Read  Green Chilli: పచ్చి మిర్చిని తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter