Saunf Seeds Benefits: సోంపు గింజలతో సులువుగా బరువు తగ్గండి ఇలా !

Saunf For Weight Loss: నేటి జీవనశైలిలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.  బ‌రువును త‌గ్గించే మందుల‌ను కూడా వాడుతూ ఉంటారు. అయితే మందుల‌ను వాడడం వ‌ల్ల బ‌రువు త‌గ్గినప్ప‌టికి మ‌నం అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 11:20 PM IST
Saunf Seeds Benefits: సోంపు గింజలతో సులువుగా  బరువు తగ్గండి ఇలా !

Saunf For Weight Loss: జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి బయట పడడానికి అనేక రకాల మందులను వాడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అనుకుంటే ఈ చిట్కాను పాటించడం వల్ల సహజంగా బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

బ‌రువు త‌గ్గ‌డంలో  సోంపు గింజ‌లు  స‌హాయ‌ప‌డ‌తాయి. సోంపు గింజ‌ల‌ను మ‌నం ఎక్కువగా ఆహారం తరువాత తీసుకుంటాము. సోంపు గింజలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డ‌డంతో పాటు మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు సోంపు గింజ‌ల‌ను వాడ‌డం చాలా సుల‌భం. 

సోంపు గింజ‌ల‌తో చేసిన కాషయం  తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు సోంపు గింజ‌లను ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజ‌ల‌ను వేసి  నాన‌బెట్టాలి.  ఈ నీటిని సోంపుతో స‌హా గిన్నెలో పోసి మ‌రిగించాలి. ఈ నీళ్లు మ‌రిగించిన త‌రువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఈ క‌షాయం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి.

Also Read  Cucumber Benefits: కీర దోసకాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.  అంతేకాకుండా  జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వంట‌ల్లో నూనెను త‌క్కువ‌గా ఉప‌యోగించాలి. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ విధంగా సోంపు గింజ‌ల నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. సోంపు గింజ‌ల నీటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా తొల‌గిపోతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read  Rotis For Diabetics: ఒక రోజు ముందు చేసిన రోటీలను డయాబెటిస్ ఉన్నవారు తింటే జరిగేది ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News