Ramadan Diet: ఉపవాసాల్లో ఎలాంటి డైట్ ఉండాలి, మధుమేహం వ్యాధిగ్రస్థులు ఏం చేయాలి
Ramadan Fasting Rules Time: ముస్లింల పవిత్రమైన నెల రంజాన్ ప్రారంభమైంది. ఇండియాలో రేపట్నించి ఉపవాసాలు మొదలు కానున్నాయి. నెలరోజుల ఉపవాస దీక్షలో ఉదయం చేసే సహరీ, సాయంత్రం ఇఫ్తార్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు ఆరోగ్యరీత్యా మంచివి.
Ramadan Fasting Rules Time: రంజాన్ నెలలో ప్రతి ముస్లిం విధింగా 30 రోజుల ఉపవాసాలు ఆచరిస్తాడు. పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరిచిన నెలగా రంజాన్‌కు అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందుకే మొత్తం 30 రోజులు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్య నిపుణులు.
రంజాన్ నెలలో ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటల్నిచి 4 గంటల వరకూ ఉండే సమయంలో భోజనం అంటే సహరీ చేస్తారు. ఆ తరువాత రోజంతా పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టరు. తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఇఫ్తార్‌తో ఉపవాసం విడుస్తారు. సహరీ సమయంలో సాధ్యమైనంతవరకూ పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వోట్స్, హోల్ వీట్ బ్రెడ్, క్వినోవా వంటి ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, పప్పులు, పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి పదార్ధాలు తినండ వల్ల హెల్తీ ఫ్యాట్ లభించడమే కాకుండా రక్తంలో చక్కెర నెమ్మది విడుదలవుతూ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. రోజంతా నీళ్లు తాగరు కాబట్టి సహరీ సమయంలోనే ఎక్కువ నీళ్లు తాగడం మంచిది.
ఇక సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఉపవాసం విడిచే సమయంలో ఇఫ్తార్ ఉంటుంది. ఇఫ్తార్‌ను ఖర్జూరంతో ప్రారంభించడం ఆనవాయితీ. ఇది మంచి పద్ధతి కూడా. రోజంతా కోల్పోయిన మినరల్స్ తక్షణం శరీరానికి అంది ఎనర్జీ ఇస్తుంది. ఖర్జూరం తిన్న వెంటనే నీళ్లు తాగాలి. ఆ తరువాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సూప్, చికెన్ , బ్రౌన్ రైస్ , హోల్ వీట్ బ్రెడ్ వంటివి తీసుకోవచ్చు.
మధుమేహం వ్యాధిగ్రస్థులు ఏం చేయాలి
మరీ ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెలరోజుల ఉపవాసం వల్ల గ్లూకోజ్ లెవెల్స్‌లో మార్పు వస్తుంది. పగలంతా ఆహారం, లిక్విడ్ తీసుకోకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ మారతాయి. దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావచ్చు. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు సహరీ, ఇఫ్తార్ సమయంలో ట్యాబ్లెట్ తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షిస్తుండాలి. బాగా ఫ్రై చేసిన పదార్ధాలు, స్వీట్స్, ప్రోసెస్డ్ ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం లేని సమయంలో పుష్కలంగా నీళ్లు తాగాలి.
మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉపవాసాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉన్నప్పటికీ ఓ రకంగా ఉపవాసాలు మేలు కూడా చేకూరుస్తాయి. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. గ్లైసెమిక్ కంట్రోల్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం వంటి లాభాలుంటాయి. ఉపవాసం వల్ల శరీరంలో దెబ్బతిన్న అవయవభాగాలు రీ సైకిల్ అవుతాయి. మరీ ముఖ్యంగా కేలరీలు అధికంగా బర్న్ అవడం వల్ల బరువు తగ్గుతారు.
Also read: Ramadan 2024: రేపట్నించి రంజాన్ ప్రారంభం, ఈ నెలలోనే ఉపవాసాలెందుకుంటారు, ఎప్పుడు మొదలైంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter