COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

How To Lose Belly Fat Naturally In 1 Week: కొంతమంది ఎన్ని రకాల ఆహారాలు తీసుకున్న పొట్ట బయటకు రాదు. కానీ మరికొంత మందిలో మాత్రం సులభంగా పొట్ట బయటకు వస్తుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ రావడం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల పొట్ట చుట్టు పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


ఇవి తప్పకుండా పాటించాలి:
ఆహారపు అలవాట్లు మార్పులు తప్పనిసరి:

ప్రస్తుతం చాలా మంది ఎక్కువ నూనె మసాలా కలిగిన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


శరీర శ్రమ తప్పనిసరి:
అతిగా కూర్చోవడం కారణంగా బెల్లీ ఫ్యాట్‌ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆఫీసుల్లో పనులు చేసేవారు తప్పకుండా గంటకు ఒక్కసారి లేచి నడవాల్సి ఉంటుంది. లేకపోతే బెల్లీ ఫ్యాట్‌ సమస్యలు రావడమే కాకుండా పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు


వయసు: 
చాలా మందిలో వయసు పెరగడం కారణంగా కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతూ ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ నియంత్రించే శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి దీని కారణంగా పొట్ట బయటు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి క్రమంలో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


ఒత్తిడి: 
చాలా మంది అతిగా ఆలోచిస్తూ ఉంటారు. దీని కారణంగా కూడా శరీరంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొందరిలో  ఒత్తిడి వల్ల మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తిలు క్రమంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని వల్ల బెల్లీ ఫ్యాట్‌ సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.  


బెల్లీ ఫ్యాట్‌ ఉన్నవారు ఇలా చేయండి:
బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం డిహైడ్రేషన్‌ సమస్యల నుంచి ఉపశమనం లభించి బెల్లీ ఫ్యాట్‌ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.  


ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందికి ఆందోళన, ఒత్తిడి సమస్యలు సాధరణంగా మారాయి. దీని కారణంగా కొలెస్ట్రాల్‌ వేగంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి  ధ్యానం, యోగా చేయాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook