Reuse Oil Side Effects: ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన నూనెను ఎన్నిసార్లు వినియోగించాలో తెలుసా?
Reuse Oil Side Effects: ప్రస్తుతం చాలామంది డీప్ ఫ్రై చేసిన నూనెను మళ్ళీ మళ్ళీ వినియోగిస్తున్నారు. వినియోగించడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంతకీ డీప్ ఫ్రై చేసినను నూనెను ఎన్నిసార్లు వినియోగించాలో తెలుసా.?
Reuse Oil Side Effects: వంట నూనె లేని వంటిల్లు ఎక్కడ ఉండదు.. ప్రతి వంటలు మనం వంట నూనెను వినియోగిస్తూ ఉంటాం. ఈ నూనె ఆహారాల రుచిని పెంచడమే కాకుండా ఆహార పదార్థాలకు మంచి రంగును అందిస్తాయి. అంతేకాకుండా గ్రేవీ రుచిని పెంచేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం చాలామంది నూనెతో ఎక్కువగా డీప్ ఫ్రైలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఒక్కసారి డీప్ ఫ్రైకి వినియోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వినియోగిస్తున్నారు. మరి కొంతమంది అయితే వీటితోనే కర్రీలను తయారు చేస్తున్నారు. ఇంతకీ డీప్ ఫ్రై చేసినను నూనెను పదేపదే వినియోగించడం మంచిదేనా? అసలు ఇలా వినియోగించడం పై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా డీప్ ఫ్రై చేసిన నూనెలను ఎక్కువగా వినియోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల నూనెలో ఫ్రీరాడికల్స్ తయారయ్యే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. దీని కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
డీప్ ఫ్రై ను నేను ఎక్కువగా వినియోగించడం వల్ల కొంతమందిలో ప్రాణాంతకమైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని తరచుగా వినియోగించడం వల్ల గుండె సమస్యలతో పాటు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగిపోయి.. శరీర బరువు కూడా సులభంగా పెరుగుతున్నారు. కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసిన నూనెలను అతిగా వినియోగించకపోవడం చాలా మంచిది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ప్రస్తుతం కొన్ని హోటల్స్ లో ఎక్కువసార్లు వినియోగించిన నూనెను ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మంటపై పదేపదే నూనెను వేడి చేస్తున్నారు. ఇలా వేడి చేయడం వల్ల ఏర్పడే పొగ కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు జిడ్డుగా ఉండెను నూనెను ఎక్కువగా వినియోగించడం శరీరానికి మరింత వారంటున్నారు. కాబట్టి నూనెను ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మాత్రమే వినియోగించాలి.. ఆ తర్వాత వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter