Brown Rice Benefits: మీరు వైట్ రైస్ తీసుకుంటున్నారా? అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి!
Benefits Of Red And Brown Rice: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. అయితే ఇందుకోసం మనం ప్రతిరోజు తెల్లటి బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటాం. ప్రస్తుతం మార్కెట్‌లో బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అనే రెండు రకాల బియ్యం లభిస్తుంది. వీటిలో ఏది తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కులుగుతుంది అనేది మనం ఇప్పుడూ తెలుసుకుందాం.
Benefits Of Red And Brown Rice: సాధారణంగా రైస్ అంటే ప్రతి ఒక్కరు తెల్ల రంగులో ఉండే దాని తీసుకుంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో బ్రౌన్ రైస్, రెడ్ రైస్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇంతకు ఎలాంటి రైస్ తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది మనం తెలుసుకుందాం.
వైట్ , బ్రౌన్ , రెడ్ రైస్ లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ రైస్: వైట్ రైస్ మిల్లులో వడ్లు బియ్యం నుంచి పాలిష్ చేసి వస్తాయి. అందుకే ఇవి చూడడానికి తెల్లగా కనిపిస్తాయి. అయితే వీటిలో అధిక శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి మాత్రం పుష్కలంగా లభిస్తుంది. ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల ఈ బియ్యంలో ఉండే పోషకాలు తగ్గుతాయి. వీటి వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధికంగా పాలిష్ చేసిన బియ్యం తీసుకోకుండా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బ్రౌన్ రైస్:
ధాన్యం నుంచి పొట్టును వేరు చేసిన తర్వాత వచ్చే రైస్‌ను బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. వీటిని పాలిష్ చేయరు. ఇది చూడడానికి బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఈ రైస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో న్యూట్రియంట్స్ అధికంగా లభిస్తాయి. రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Jaggery Combination Food Items: బెల్లంతో ఈ పదార్థాలను కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్!
రెడ్ రైస్: ఈ బియ్యం చూడడానికి రెడ్ కలర్‌లో ఉంటుంది. దీనిలో ఆంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల ఈ రంగులో ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్‌లు పొందవచ్చు. అలానే ఇది రక్తం శుద్ధి చేయడంతో పాటు చర్మంపై వచ్చే వలయాలను తగ్గిస్తుంది.
అందుకే వైద్యులు కూడా వైట్ రైస్ కన్నా ఈ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఆరోగ్యకరమైనవని అంటున్నారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఎలాంటి మందులను ఉపయోగించకుండా అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
ఈ రైస్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభించడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ
బ్రౌన్, రెడ్ రైస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు.
ఆరోగ్యకరమైన జీవితం పొందాలని అనుకునేవారు తప్పకుండా ఈ బ్రౌన్, రెడ్ రైస్ తీసుకోవడం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Pomegranate Benefits: రోజూ పరగడుపున దానిమ్మ తింటే ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook