Rid Sore Throat In 15 Minutes: వాతావారణంలో మార్పుల కారణంగా తేమలో హెచ్చుతగ్గులు వచ్చి సీజనల్‌ వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో శరీరంపై ఎంత శ్రద్ధ వహిస్తే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ఈ చిన్న వ్యాధులే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో చలి కాలం మొదలైంది. దీని కారణంగా చాలా మందిలో జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ సీజనల్‌ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు పలు రకాల చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గొంతు నొప్పికి ఎలా చెక్‌ పెట్టాలి..?:
సీజనల్‌ వ్యాధుల కారణంగా చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సులభంగా లభించే పలు రకాల దినుసుల వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


మెంతులు:
మెంతుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ విలువలు లభిస్తాయి. కాబట్టి గొంతు నొప్పితో బాధపడేవారు ఒక చెంచా మెంతి గింజలను కప్పు నీటిలో మరబెట్టి.. ఆ నీటిని ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


తేనె:
తేనెను అన్ని రకాల నొప్పులకు దివ్యౌషధంగా భావిస్తారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే సీజనల్‌ వ్యాధుల్లో వచ్చే గొంతు నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వేడి నీటిలో తేనెను కలుపుకుని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.


పసుపు, ఉప్పు నీరు:
గొంతు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఒక గ్లాసు వేడి నీటిని తీసుకుని అందులో ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా పసుపును వేసి ఈ నీటిని పుకులించి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నోరు కూడా ఫ్రెస్‌గా మారుతుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Nara Brahmani: జయలలిత ఫామ్‌హౌస్ నారా బ్రాహ్మిణి కొనుగోలు..? సోషల్ మీడియాలో ప్రచారం.. టీడీపీ క్లారిటీ


Also Read: RGV Meets CM YS Jagan : వైఎస్ జగన్‌తో ఆర్జీవీ భేటీ.. పవన్ కళ్యాణ్ పరువుతీసేందుకే కుట్ర?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి