EX CM Jayalalitha Hyderabad Farmhouse: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత ఫామ్‌హౌస్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కొనుగోలు చేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జయలలితకు ఓ ఫామ్‌హౌస్ ఉందని.. దాన్ని 1600 కోట్ల రూపాయలు పెట్టి బ్రాహ్మిణి కొనుగోలు చేశారని ఓ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్దగా డబ్బులు లేకపోయినా.. 1600 కోట్ల రూపాయలు జయలలిత ఫామ్‌హౌస్ కొన్న నిరుపేద నారా బ్రాహ్మణి అంటూ ఆమెపై తెగ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది. నారా బ్రాహ్మిణిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఫైర్ అయింది. ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడంటూ మండిపడింది. నారా బ్రాహ్మణి రూ.1600 కోట్లతో దివంగత జయలలితకు చెందిన ఫామ్‌హౌస్ కొన్నారని వైసీపీ పేటీఎం బ్యాచ్‌లో కొందరు ఫేక్ పోస్టులు పెట్టారని అన్నారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధం అవుతున్నారని తెలుగుదేశం పార్టీ తెలిపింది. దీంతో ట్విట్టర్‌లో పోస్టులు పెట్టిన కొందరు తమ ట్వీట్స్‌ను డిలీట్ చేశారు.
ఎందుకు ఈ ప్రచారం..
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు మేడ్చల్ సమీపంలో జేజే గార్డెన్ పేరుతో దాదాపు 25 ఎకరాల్లో ఓ పెద్ద ఫామ్‌హౌస్ ఉందట. అయితే ఇటీవల ఆ ఫామ్‌హౌస్ పేరు మారిపోయినట్లు తెలుస్తోంది. ఆ ఫామ్‌హౌస్ వద్ద మరో కంపెనీకి చెందిన ప్రాపర్టీగా అక్కడ ఓ బోర్డును పెట్టారట. ఈ ఫామ్‌హౌస్‌ను నారా బ్రాహ్మిణికి తెలిసిన కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేశారని కొందరు ప్రచారం చేశారు. ఆ తరువాత నారా బ్రాహ్మిణిని టార్గెట్ చేసుకున్నారు. నిరుపేద బ్రాహ్మిణి రూ.1600 కోట్లతో ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారంటూ ట్వీట్స్ వైరల్ చేశారు. దీంతో ఇది రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈ ప్రచారం అంతా ఫేక్ అని స్పష్టం చేస్తోంది టీడీపీ. తప్పుడు ప్రచారం అని ఫ్యాక్ట్ చెక్ టీడీపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా నుంచి రీ ట్వీట్ చేశారు.
Also Read: నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు నేడే... మధ్యాహ్నం 12.30 నుంచి మ్యాచ్ ప్రారంభం
Also Read: RRR: 'ఆర్ఆర్ఆర్'కు మరో అరుదైన గౌరవం.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డుకు ఎంపిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి