Ridge Gourd Flower Benefits For Weight Loss: వర్షకాలం ముగింపు దశకు చేరుకుంది. దీని కారణంగా వాతావరణంగా చలి, గాలి తీవ్ర ఒక్కసారిగా పెరిగిపోతోంది. దీంతో చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యాధుల తీవ్రత మరింత పెరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది ఈ సమయంలో బరువు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వ్యాధుల తీవ్రత రెట్టింపు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీర పువ్వుతో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ పువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్, యాంటీ బాక్టీరియల్, కాపర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి, ఫ్లోరిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు అయోడిన్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 


బీర పువ్వు వల్ల శరీరానికి కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

బీర పువ్వులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ పువ్వులను కూరగా తయారు చేసుకుని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరాకి విటమిన్స్‌ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


రక్తంలోని చక్కెర పరిమాణాలు నియత్రణలో ఉంటాయి:
బీర పువ్వులో పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు క్రమం తప్పకుండా బీర పువ్వును ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉశమనం లభిస్తుంది.


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!


బరువు తగ్గుతారు:
శరీర బరువును తగ్గించేందుకు బీర పువ్వు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో తక్కువ పరిమాణంలో క్యాలరీలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో పీచు పదార్థాలు లభిస్తాయి. కాబట్టి ఆకలిని నియంత్రించి శరీర బరువు తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.