Edible Oils Risk: కేన్సర్ ఓ ప్రాణాంతకమైన మహమ్మారి. ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. వైద్యం లభిస్తుంది. మనం నిత్యం వాడే కొన్నిరకాల పదార్ధాలు కేన్సర్ కు కారణమవుతుంటాయి. అందులో నూనెలు ప్రధానంగా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ ఓ ప్రాణాంతక వ్యాధిగా ఇప్పటికీ పీడిస్తూనే ఉంది. సాధారణంగా కేన్సర్ అనేది ప్రాణాలు తీసేవరకూ వదలదు. దీనికి ప్రధాన కారణం ప్రారంభంలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించలేం. అందువల్లనే చికిత్స కష్టమౌతుంటుంది. కేన్సర్‌కు చాలా కారణాలున్నాయి. అన్నింటికంటే ప్రధానమైంది మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. అందుకే ముందుగా మీరు ఉపయోగించే వంటనూనె ఎలాంటిదో తెలుసుకోండి.


మన దేశంలో ఆయిల్ లేకుండా రుచికరమైన వంటలనేవి దాదాపు అసాధ్యం. కానీ అవసరాన్ని మించి వంట నూనె వాడితే మాత్రం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలుసుకోండి. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన ఆహారం శరీరపు పీహెచ్ స్థాయిని అదుపు తప్పేలా చేస్తుంది. దాంతో కడుపులో కొవ్వు పెరగడం, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. మనం తినే ఆహారంలో శాచ్యురేటెడ్ ఆయిల్ ఎక్కువగా ఉండటం లేదా వెజిటెబుల్ ఆయిల్ అధికంగా వినియోగించడమనేది చాలా ప్రమాదకరమని చాలా అధ్యయనాలు స్పష్చం చేశాయి. అందుకే కేన్సర్‌కు కారణమయ్యే.. అటువంటి వంటనూనెల్ని వెంటనే మీ కిచెన్ నుంచి తొలగించండి.


హానికరమైన వంటనూనెలు


సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామ్ ఆయిల్‌లు ఎక్కువగా వేడెక్కే కొద్దీ ఎల్‌డిహైడ్ కెమికల్ విడుదల చేస్తాయి. ఇది కేన్సర్ పుట్టించే కారకం. దీనివల్ల శరీరంలో కేన్సర్ సెల్స్ ఏర్పడతాయి. అందుకే ఈ ఆయిల్స్ వాడకాన్ని తక్షణం నిలిపివేస్తే మంచిది. కొన్ని రకాల వంటనూనెల్లో పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఒకవేళ వీటిని హై టెంపరేచర్‌పై వేడి చేస్తే ఎల్‌డిహైడ్‌గా విడిపోతుంటుంది. డీమోన్ ఫోర్ట్ యూనివర్శిటీలో చేసిన ఓ అధ్యయనం ప్రకారమైతే..కొన్ని వంటనూనెల్లో రోజువారి పరిమితి కంటే 2 వందల రెట్లు ఎక్కువ ఎల్‌డిహైడ్ ఉత్పన్నమవుతుందట. 


కొన్ని రకాల వంటనూనెలతో కేన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రదానంగా నెయ్యి, వైట్ బటర్, ఆలివ్ ఆయిల్ ప్రధానంగా ఉంటాయి. వీటిని వేడిచేస్తే ఎల్‌డిహైడ్ తక్కువగా విడుదలవుతుంది. అందుకే సాధ్యమైనంతవరకూ ఆయిల్ లెస్ ఆహారపదార్ధాలు అలవర్చుకుంటే మంచిది. అలా చేస్తే కేన్సర్ ఒక్కటే కాకుండా డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు కూడా దూరమౌతాయి.


Also read: Cardamom For Skin: చర్మ సౌందర్యం మెరుగయ్యేందుకు యాలకుల వినియోగం తప్పనిసరి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.