Weight Loss Tips: సపోటా పండ్లతో బరువు తగ్గడమేకాకుండా.. ఈ అనారోగ్య సమస్యలకు చెక్..
Sapodilla For Weight Loss: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా మంది బరువు పెరగడం ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.
Sapodilla For Weight Loss: సపోటా పండ్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ సపోటాలో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని చలి కాలంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
చలి కాలంలో వీటిని తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి:
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
సపోటాను క్రమం తప్పకుండా తింటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా సీజన్ మారడం కారణంగా వచ్చే వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జలుబు, ఫ్లూ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.
ఎముకలు దృఢంగా మారుతాయి:
సపోటా పండ్లు ఎముకలకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా కండరాలు కూడా దృఢంగా మారుతాయి.
రక్తపోటుకు చెక్:
సపోటాలో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి ప్రభావవంగా సహాయపడతాయి. అయితే వీటిరి వేడి నీటిలో మరించి ఆ నీటి తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
బరువు తగ్గుతారు:
సపోటా పండ్లలో ఉండే పోషకాలు శరీర బరువును సులభంగా నియంత్రించడానికి సహాయపడతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.
Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స
Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook