COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sapota Fruit Benefits In Telugu: సపోటా పండ్లలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఇందులో విటమిన్ A ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇది చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. సపోటా పండ్లలో విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్, ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే ఇందులో ఫైబర్, ఫాస్పరస్, కాల్షియం కూడా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 


ఎముకల ఆరోగ్యం: 
సపోటాలో కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇతర ఎముకల సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. 


గుండె సమస్యలకు చెక్‌
సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ఇతర సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. 


జీర్ణ వ్యవస్థ: 
సపోటాలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.


శక్తివంతం చేస్తుంది: 
సపోటాలో ఉండే ఫ్రక్టోజ్ శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా అలసట, నీరసం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


చర్మ ఆరోగ్యం: 
సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ముడతలు, మచ్చలు తగ్గి చర్మం మృదువుగా మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా సపోటాలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి