Viral Attack: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొత్త వైరస్ లు.. అవేంటో తెలుసా?
Virus : కరోనాకి ముందు ఒకలా ఉన్న ప్రపంచం కరోనా తర్వాత ఎంతగానో మారిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ఎవరికీ లేని భయం కరోనా ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది. గత కొద్ది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడుస్తూనే ఉంది. అయితే ప్రపంచంలో ఇలాంటి వైరస్ లు ఇంకా చాలానే ఉన్నాయి. నిజానికి కొత్త వైరస్ లు కూడా పుట్టుకు వస్తున్నాయి. మరి వాటి గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా?
Virus : కరోనా తర్వాత వైరస్ ల గురించి చాలా మందికి అవగాహన వచ్చింది. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న భయంకరమైన వైరస్ లతో పాటు రోజుకి ఒక కొత్త వైరస్ కూడా పుట్టుకు వస్తోంది. ఇలాంటి వైరస్ లు ప్రజలని వణికిస్తున్నాయి అని చెప్పవచ్చు. కానీ మానవాళిపై ఎప్పటికప్పుడు పై చేయి సాధిస్తున్న కొత్త వైరస్ లకు ది ఎండ్ పలకడం కోసం సైంటిస్టులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అమెరికన్ సైంటిస్టులు ఈ విషయం లో మంచి ఫలితాలు కూడా సాధించారు.
వైరస్ పేరు వింటేనే ప్రపంచం మొత్తం ఉలిక్కి పడుతుంది. కరోనా సమయంలో కలిగిన ప్రాణ నష్టం ఇప్పటికీ మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఇలాంటి భయంకరమైన వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి చాలా కాలం పట్టింది. కానీ భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతకమైన వైరస్ లు మరిన్ని రాబోతున్నాయి. వాటి కారణంగా జరగబోయే అనర్ధాలు ఆపడం కోసం మానవాళి ముందుగానే ఈ వైరస్ లపై పై చేయి సాధించాల్సి ఉంటుంది. తాజాగా అమెరికన్ సైంటిస్టులకు అలాంటి ఒక మార్గం కనిపించినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యనే అమెరికన్ సైంటిస్టులు వైరస్ లు విడివిడిగా కాకుండా ఒకదాని మీద ఒకటి అతుక్కునే ఉంటాయని కనుక్కున్నారు. రెప్లికేషన్ ప్రక్రియలో రెండు బ్యాక్టీరియో ఫేజ్ వైరస్ లు కలిసి ఉంటాయట. ఈ మధ్యనే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ మైక్రోబియన్ ఎకాలజీ లో కూడా దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది.
ఆ ఆర్టికల్ ప్రకారం రెండు బ్యాక్టీరియో ఫేజ్ వైరస్ ల మధ్య సంబంధం ఉంటుంది అని, సాటిలైట్ వైరస్ లు సెల్ లోకి చొరబడినప్పుడు వాటి డిఎన్ఏ మారుతుందని, సహాయక వైరస్ లపై ఆధారపడటానికి ప్రయత్నిస్తాయని చెబుతున్నారు. సాటిలైట్ వైరస్ లతో పాటు సహాయక వైరస్ లు కూడా కణాన్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఒకదాని మీద మరొకటి దగ్గరగా ఉంటాయి. సహాయక వైరస్ లతో దగ్గరగా ఉండటం కోసం సాటిలైట్ వైరస్ లు వాటి మెడను అంటుకుని ఉంటాయి. కొన్ని శాటిలైట్ వైరస్ లు బ్యాక్టీరియో ఫేజ్ కణాల జన్యువులు చేరడానికి ఎవల్యూషన్ లో భాగంగా హెల్పర్ వైరస్ లపై ఆధారపడతాయట.
కలుషితంగా ఉండే చాలా వైరస్ లలో ఈ సాటిలైట్ వైరస్ లు హెల్పర్ వైరస్ లు కలిసి ఉంటాయి. ఈ రెండు వైరస్ ల కలయిక గురించి ఇప్పుడు సైంటిస్టులు మరింత లోతైన అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!
Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook