Selfies Health Benefits In Telugu


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత సెల్ఫీలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. చాలామందికి ఈ అలవాటు విడ్డూరంగా ఉంటుంది. కానీ తీసుకునే వారికి సరదాగా ఉంటుంది. నీకెప్పుడూ సెల్ఫీల పిచ్చేనా అని అడిగేవారికి గట్టిగా సమాధానం చెప్పే టైం వచ్చేసింది.. సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి వాళ్లకి కూడా అర్థమయ్యేలా చెప్పేసేయండి. ఇంతకీ సెల్ఫీల వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..


పార్టీ ,ఫంక్షన్ ఇలా దేనికి రెడీ అయినా మనలో చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు మనకు పరిచయం కూడా లేని ఈ సెల్ఫీ అనే పదం ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. మన ఫోటోలు మనమే తీసుకోవడం అనేది ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. చక్కటి చిరునవ్వుతో పాటు అందంగా ఉండే మీ ముఖాన్ని సెల్ఫీ రూపంలో తీసుకోవడం వల్ల.. మీరు మీ లుక్స్ పై శ్రద్ధ పెడతారు. ఈసారి సెల్ఫీలో ఇంకా అందంగా కనిపించాలి అని ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరిస్తారు. ఇలా సెల్ఫీలు తీసుకోవడం వల్ల మన శారీరక ,మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కుదురుతుంది.


ఆత్మవిశ్వాసాన్ని పెంచే సెల్ఫీ..


అవునండి.. సెల్ఫీలు తీసుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సెల్ఫ్ 
లవ్.. మనలో చాలామంది మర్చిపోయిన పదం.. అవతలి వారి కి ప్రాధాన్యత ఇవ్వడం కంటే కూడా ముందు మనల్ని మనం ఇష్టపడడం ఎంతో ముఖ్యం. అలా ఉండేవారే ఎటువంటి టెన్షన్స్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపగలుగుతారు. మనం తీసుకునే సెల్ఫీలు మన అందాన్ని మనకు చూపించడమే కాదు మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి.


 జీవితాన్ని ప్రతిబింబించే సెల్ఫీలు..


మీరు మీ జీవితంలో సంతోషంగా ఉన్నారా లేక ఏదన్నా అంతర్గతంగా మదన పడుతున్నారా అన్న విషయాన్ని కూడా మీ సెల్ఫీలు చూసి ఇట్టే చెప్పొచ్చు. ఈ సెల్ఫీలు చూసుకునేటప్పుడు మనం దాటి వచ్చిన కష్టాలు గుర్తు వస్తాయి. అటువంటి కష్టాలు దాటిన గుండె ధైర్యం గుర్తుకు వస్తుంది. మన జీవితంపై కొత్త ఆశ చిగురుస్తుంది. మనం జీవితంలో మరింత ముందుకు వెళ్లడానికి ఇవి ఉపయోగపడతాయి.
 
స్ట్రెస్ తగ్గించే సెల్ఫీలు..


సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్ గా ఉన్న వాటిల్లో సెల్ఫీలు కూడా ఒకటి. మనం సెల్ఫీలు షేర్ చేసినప్పుడు పక్కన వారు వాటిని మెచ్చుకుంటే ఆ కలిగే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆత్మనూన్యతా భావంతో.. గుర్తింపు లేదు అని బాధపడే వారికి సెల్ఫీలు స్ట్రెస్ చాలా వరకు తగ్గిస్తాయి.


సెల్ఫీలు ఆరోగ్యానికి మంచిది కానీ అది కూడా ఒక లిమిట్ వరకే అన్న విషయం మరువకండి. శృతి మించితే అమృతం కూడా విషం గా మారుతుంది.. కాబట్టి సెల్ఫీలు తీసుకోవాలి అనే పిచ్చిలో కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి. అలా చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. సెల్ఫీలు మన ఆనందానికి మాత్రమే.. పక్కన వాళ్ళుకు ప్రూవ్ చేయడానికి కాదు. ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోవడానికి సాహసించకండి.. సముద్రతీరాలు, ఎత్తైన ప్రదేశాలు వంటి వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే సమయంలో అత్యంత జాగ్రత్త పాటించండి.


Also Read: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


Also Read: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook