Sleep deficiency: నిద్రకి బరువుకి ఉన్న సంబంధం ఏమిటి.. తక్కువ నిద్రపోతే ఏమవుతుంది
Sleep disorders: మనిషికి ప్రశాంతమైన జీవితం గడపడానికి చాలా ముఖ్యమైనవి తిండి, నిద్ర. ముఖ్యంగా నిద్ర లేకపోతే మన జీవితంలో ప్రశాంతత అనేది చాలా కరువు అవుతుంది. అందుకే ఎంతోమంది వైద్యులు మనం ప్రతిరోజు కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి అని సూచిస్తూ ఉంటారు. మరి నిద్ర తక్కువ అయితే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Sleep Deprivation: ప్రస్తుతం మారుతున్న జీవన శైలు వల్ల మన నిద్రలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్‌ల వాడకం ఎక్కువవ్వడం, నైట్ షిఫ్టులు ఉండటం, లైఫ్‌స్టైల్ మార్పులు కారణంగా చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు ఏదో ఒక కారణం వల్ల తక్కువగా నిద్రపోవుగా మనం ప్రస్తుతం గమనిస్తున్న విషయం. కానీ దీనివల్ల మన రోజువారీ పనులు, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 7 గంటలు కూడా ప్రశాంతంగా నిద్రపోకపోతే.. ఎలాంటి దుష్ప్రభావాలు మనకు కలుగుతాయో.. అలానే దీనివల్ల మనం బరువు కూడా కూడా పెరగటామా లేదా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం..
బరువు పెరుగుతామా ?
రాత్రిపూట 7 గంటలకంటే తక్కువ నిద్రపోతే మనము తప్పకుండా.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంది అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే పడుకోకుండా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ కేలరీలను వినియోగించుకుంటుంది. ఫలితంగా మనకు తెలియకుండానే మనం ఎక్కువగా తింటూ ఉంటాం. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసేపు మేలుకునే వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉండటం గమనిస్తూ ఉంటాం. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. నాలుగు గంటల కంటే తక్కువగా పడుకున్న వారిలో దాదాపు 10శాతం అనవసరపు కొవ్వులు పెరిగినట్లు ఓ అధ్యయనంలో కూడా తేలింది. కాబట్టి నిద్రకి బరువుకి సంబంధం ఉంది అని నిద్రపోకపోతే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువే అంటున్నారు చాలామంది నిపుణులు.
ఇమ్యూనిటీ పై ప్రభావం
కరోనా వచ్చిన దగ్గరనుంచి మన ఇమ్యూనిటీ పవర్ మనకు తెలియకుండానే చాలా తగ్గిపోయింది. కాగా రోగనిరోధక వ్యవస్థ ఉత్తమంగా పనిచేయడానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరమత. గాఢమైన నిద్రలో, మీ శరీరం సైటోకిన్‌లను ఉత్పత్తి చేస్తుంది, విడుదల చేస్తుంది. ఫలితంగా మనకు ఇమ్యూనిటీ పెరిగి అది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు మంచి బయటపడడానికి సహాయపడుతుంది. అదే మనం కానీ తక్కువగా నిద్రపోతే.. సైటోకిన్‌ల ఉత్పత్తి తగ్గి రోగనిరోధక రక్షణను బలహీనపరుస్తుంది. అందువలన ఎన్నో అనారోగ్య సమస్యలు రావచ్చు.
అంతేకాదు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే.. అలసటగా, గజిబిజిగా మేల్కొంటారు. దీనివల్ల మీ దినచర్యల పైన కూడా ఎంతో ప్రభావం పడుతుంది. పనులలో ఏకాగ్రత, అప్రమత్త తగ్గుతుంది. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఎదుర్కొనే బదులు ప్రశాంతంగా ఏడుగంటలు నిద్రపోతే మంచిది.
గమనిక: పైన చెప్పినవన్నీ అధ్యాయనాలు, ఆరోగ్య నిపుణులు దగ్గర నుంచి సేకరించిన వివరాలు. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిలో ఏవి పాటించాలి అన్న ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook