Side Effects of Skipping Breakfast: ఉదయం అల్పాహారం తినకపోతే.. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు తప్పవా?
Side Effects of Skipping Breakfast: ప్రతి రోజు ఉదయం పూట అల్పాహారం తీసుకోలేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధుల కూడా వస్తున్నాయి.
Side Effects of Skipping Breakfast: ప్రతి రోజు ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్ కారణంగా టిఫిన్ తినడం మానుకుంటున్నారు. దీంతో పాటు కొంతమంది బరువు పెరుగుతున్నారనే కారణంగా అల్పాహారం తీసుకోలేకపోతున్నారు. ఇలా ప్రతి రోజు టిఫిన్ తినడం మానుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం టిఫిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజు అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది. అంతేకాకుండా బాడీకి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రతి రోజు ఉదయం పూట టిఫిన్ తీసుకోకపోవడం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం నిద్రలేచిన 1 గంటలోపు అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో కేవలం లైట్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
అల్పాహారం తీసుకోకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
ఊబకాయం:
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటు స్థూలకాయం సమస్యలకు గురవుతున్నారు. అయితే కొంతమంది ప్రతి రోజు ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల కూడా సులభంగా బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు రాత్రి సరిగ్గా తినని వారు ప్రతి రోజు ఉదయం పూట తప్పకుండా టిఫిన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సులభంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నయాని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా కొంతమందిలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది.
పోషకాల కోరత:
ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పోషకాలు కూడా తగ్గే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే దీని కారణంగా కొంతమందిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహం వచ్చే ప్రమాదం:
ప్రతి రోజు ఉదయం పూట టిఫిన్ తినకపోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంతక ముందే మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
అధిక రక్తపోటు:
చాలా మంది అల్పాహారం తీసుకోకపోవడం కారణంగా అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా గుండె పోటు, అధిక బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఉదయం పూట టిఫిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి