lifestyle Diceases: ఆధునిక జీవన ప్రపంచంలో రక్తపోటు, డయాబెటిస్ సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఇంచు మించు ప్రతి ఒక్కరికి ఈ సమస్య వెంటాడుతుందంటే ఆశ్చర్యం లేదు. చాపకిందనీరులా విస్తరిస్తున్న ఆ అనారోగ్య సమస్యల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా చేస్తే మంచిదనేది నిపుణుల అభిప్రాయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోటీ ప్రపంచంలో నిత్యం ఎదురవుతున్న సవాళ్లు, కాలంతో పోటీ పడుతూ క్షణం తీరిక లేకుండా గడిపే పరిస్థితి, మానసిక విశ్రాంతి పూర్తిగా కరువై అనారోగ్యాల్ని కొనితెచ్చుకుంటున్న వైనం. వెరసి మనిషి జీవితాన్ని అన్ని విధాలుగా సవాలు చేస్తున్నాయి. ప్రస్తుతం రక్తపోటు, షుగర్(Blood Pressure) అనేవి చాలా సాధారణంగా మారిపోయాయి. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా పల్లెల్లోనూ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. ప్రది పదిమందిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి 8 మందిలో ఒకరికి షుగర్ ఉంటున్న పరిస్థితి ఉందంటే...ఈ సమస్యల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో 26 శాతం, పట్టణాల్లో 30 శాతమంది బీపీ బాధితులున్నారని అంచనా. అదే డయాబెటిస్ విషయానికొస్తే పల్లెల్లో 19 శాతం, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నారు. ఏపీలో దాదాపు 20.5 శాతం మంది షుగర్ బాధితులున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఇంత పెద్ద సంఖ్యలో ఉండటం ఆందోళన కల్గించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో చాలామంది కేవలం అవగాహన లేక, నిర్లక్ష్యంతో మాత్రమే ఈ రెండు ప్రమాదకర జబ్బుల్ని నియంత్రించుకోలేకపోతున్నట్టు, ఫలితంగా గుండెజబ్బులకు గురవుతున్నట్టు అంచనా.


జీవనశైలి (Lifestyle)కారణంగా తలెత్తే ఈ సమస్యల్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. వారానికోసారి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఎన్‌సీడీ స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. అటు 104 వాహనాల ద్వారా స్క్రీనింగ్ చేస్తూ ఉచితంగా మందులిచ్చే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం(Ap government) చేపట్టింది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ పరీక్షల్ని ఎప్పటికప్పుడు చేయించుకోవాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. కేవలం ఒత్తిడి కారణంగా ఈ జబ్బులు వస్తున్నాయనేది సుస్పష్టం. సరైన ఆహారం తీసుకోకపోవడం, చిన్నారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలకు లోవడం కారణాలుగా ఉన్నాయి. అందుకే పిల్లల్ని సాధ్యమైనంతవరకూ ఆటల వైపు దృష్టి మళ్లించాలి. పెద్దవాళ్లైతే యోగా లేదా వ్యాయామం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ తప్పనిసరి చేసుకుంటే ఇంకా మంచిదంటున్నారు వైద్యులు. శారీరక వ్యాయమం లేకపోతే చిన్న వయస్సులోనే ఇలాంటి జబ్బులొచ్చే ప్రమాదం కూడా ఉంది. 


Also read: కంప్యూటర్ ముందు గంటల తరబడి గడుపుతున్నారా..! మీ కంటి చూపు దెబ్బ తింటుందని భయమా...! అయితే ఇలా చేయండి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook