Skin Care Tips: వేసవిలో ఈ కూరగాయలను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!
Skin Care Tips: వేసవి కాలంలో చర్మసౌందర్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఎండల ధాటికి ముఖంపై టానింగ్ రావడం మొదలవుతుంది. అయితే ఈ టానింగ్ ను ఓ వంటింటి చిట్కా ద్వారా నివారించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Skin Care Tips: వేసవిలో మండే ఎండలు, వేడి గాలుల కారణంగా ముఖ సౌందర్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎండల ధాటికి చర్మంపై ట్యానింగ్ మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకాంతి నుంచి తమ చర్మాన్ని కాపాడుకునేందుకు చాలా మంది ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కానీ, ఈ సమస్యలను సహజంగా కూడా నివారించుకోవచ్చు. అలాంటి చర్యలతో ముఖంపై కోల్పోయిన కాంతిని తిరిగి పొందవచ్చు.
టొమాటో ముఖానికి ఔషధం
టొమాటోలను ఉపయోగించడం వల్ల చర్మాన్ని శుద్ధి చేయడం సహా బిగుతుగా మార్చడంలో సహాయపడుతాయి. చర్మానికి ఔషధంగా పనిచేసే అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్నందున టొమాటోను ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. అయితే టొమాటోల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
టొమాటో వల్ల ముఖానికి కలిగే ప్రయోజనాలు..
1. ముఖంపై టాన్ తొలగించేందుకు
కూరగాయల్లో టొమాటోకు ప్రకాశవమంతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మంపై సన్‌బర్న్ కారణంగా ఏర్పడే టానింగ్‌ను కూడా తొలగిస్తుంది. దీని కోసం మీరు ఒక పెద్ద టొమాటో గుజ్జును తీసుకుని దానికి ఒక చెంచా పెరుగు, నిమ్మరసం కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం సహా మెడ చుట్టూ అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరగా నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల టాన్ తగ్గిపోతుంది. చర్మంపై UV కిరణాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
2. ముఖంపై జిడ్డును తగ్గించేందుకు..
ముఖం జిడ్డుగా ఉన్న వారికి టొమాటో చాలా ఉపయోగపడుతుంది. టొమాటో ద్వారా ముఖాన్ని శుభ్రపరుచుకోవడం వల్ల ముఖం బిగుతుగానే కాకుండా జిడ్డు లేకుండా కనిపిస్తుంది. అందుకోసం పచ్చి టొమాటోలను కట్ చేసి.. వాటిని ముఖమంతా రుద్దాలి. అలా సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం అందంగా కనిపిస్తుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Coriander Seeds Water Benefits: కొత్తి మీర గింజలతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా..?
Also Read: Raw Onion Side Effects: వేసవి అతిగా ఉల్లిపాయలను తింటున్నారా? అయితే మీరు ఈ నష్టాన్ని ఎదుర్కొక తప్పదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook