Skin Tan Removal: స్కిన్ ట్యాన్ విషయంలో స్నానం చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం శరీరాన్ని బాత్ టబ్ లో కొద్ది సమయం అలానే ఉంచడం వల్ల సన్ బర్న్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు కొన్ని నేచురల్ టిప్స్ ద్వారా స్కిన్ ట్యాన్ ను నివారించుకోని.. చర్మాన్ని పునేరుజ్జీవింపజేయవచ్చు. అయితే ఆ నేచురల్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) కలబంద


కలబంద చర్మానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అందుకే దీనిని అనేక సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. స్కిన్ టానింగ్ విషయంలో అలోవెరా జెల్‌ని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయడం వల్ల చర్మం ఉత్తేజకరంగా మారుతుంది. 


2) వోట్ మీల్


వోట్ మీల్ చర్మానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. మీరు దానితో పాలు, తేనె కలపడం వల్ల తయారైన మిశ్రమంతో వడదెబ్బ ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు. 


3) చల్లని ఐస్ క్యూబ్స్


స్కిన్ టానింగ్‌కు ఐస్ దివ్యౌషధంగా పరిగణిస్తారు. దీని కోసం ఐస్ బ్యాగ్‌లో ఐస్‌ను ఉంచి, ఆపై ప్రభావిత ప్రాంతాలలో సున్నితంగా మర్దన చేయాలి. ఐస్ బ్యాగ్ లేకపోతే ఐస్‌ను గుడ్డ లేదా ప్లాస్టిక్‌లో ఉంచడం ద్వారా సున్నితమైన మసాజ్ చేయవచ్చు. దీంతో చర్మ సమస్యలు దూరం అవుతాయి.


4) కొబ్బరినూనె


కొబ్బరినూనె చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. వడదెబ్బ కారణంగా చర్మం కాలిపోయినప్పుడు.. మొదట చల్లటి నీటితో శుభ్రం చేసి, ఆపై కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మళ్లీ పునర్జీవనంగా మారుతుంది. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


ALso Read: Milk Side Effects: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలు అసలు తాగొద్దు!


Also Read: Painkiller Side Effects: పెయిన్ కిల్లర్స్ తో జాగ్రత్త.. అతిగా వాడితే అంతే సంగతులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook