Milk Side Effects: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలు అసలు తాగొద్దు!

Milk Side Effects: పాలు తాగడం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలను బాధపడుతున్న వారు పాలు తాగకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 03:58 PM IST
Milk Side Effects: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలు అసలు తాగొద్దు!

Milk Side Effects: పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. వృద్ధులకు, గర్భిణులకు, పిల్లలకు ఇది మంచి పోషకాహరంగా వైద్యులు చెబుతారు. అదే విధంగా శాకాహారులకు కావాల్సిన ప్రోటీన్, కాల్షియం వంటివి పాలు, వాటి ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పాలలో అదనంగా లభిస్తాయి. అందువల్ల పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. 

పాలను రోజూ తాగడం వల్ల శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలు తాగడం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భాల్లో పాలు తాగకపోవడమే మంచిది. 

1. కాలేయ సమస్యలు పెరగవచ్చు

పాలు జీర్ణం కావడం కష్టం కాబట్టి కాలేయ సమస్యలు ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలి. పాలు తాగడం వల్ల కాలేయం వాపు పెరుగుతుంది. అందువల్ల పాలలో ఉండే కొవ్వు వల్ల కాలేయ వ్యాధి లక్షణాలు పెరుగుతాయి. ఫైబ్రాయిడ్ సమస్యలు కూడా పెరగవచ్చు.

2. జీర్ణ సమస్యలు

పాలు తాగడం వల్ల జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాలు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. తరచూ పొత్తికడుపు సమస్యలు ఉన్నవారు కూడా పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. మరికొందరికి ఖాళీ కడుపుతో పాలు తాగే అలవాటు ఉంటుంది. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గాలి లేదా అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

3. చర్మ సమస్యలు

పాలలోని లాక్టోస్ కొన్నిసార్లు చర్మ సమస్యలను కలిగిస్తుంది. పాలు తాగడం వల్ల తీవ్రమైన మొటిమల సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఈ సమస్య చాలా ఎక్కువ అవుతుంది. ముఖంపై మొటిమలు ఉంటే పాలు తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read: Almond Oil Benefits: ముఖం కాంతిమంతంగా మెరవాలంటే ఈ టిప్ ను కచ్చితంగా పాటించండి!

Also Read: Turmeric for Diabetes: ఆహరంలో పసుపు వినియోగంతో డయాబెటిస్ కు చెక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News