Sleep and Heart Attack Risk: మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు 7 గంటల కంటే తక్కువే నిద్రపోతుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. ప్రమాదకరమైన గుండెపోటు మీ గుమ్మం వద్ద ఎదురుచూస్తున్నట్టే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన ఆరోగ్యం కోసం చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం లేచినప్పట్నించి రాత్రి పడుకునేవరకూ..తినే ఆహారం, చేసే పని, రాత్రి నిద్ర అన్నీ ముఖ్యమే. అన్నింటికంటే ప్రధానమైంది నిద్ర. రోజుకు 8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు. మీరు రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే మాత్రం...మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టేనంటున్నారు. ఎందుకంటే 7 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారంటే..ప్రమాదకరమైన గుండెపోటు మీ గుమ్మ వద్ద మీ కోసం ఎదురు చూస్తుందని అర్ధమట.


రోజుకు రాత్రి వేల 7-8 గంటలు  నిద్ర లేకపోతే ఏమౌతుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. రోజుకు ఆ మాత్రం నిద్ర లేకపోతే నెమ్మది నెమ్మదిగా అనారోగ్యం పాలవుతారు. ముఖంపై వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కన్పిస్తాయి. బరువు పెరగడం, కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్లడ్ ప్రెషర్ , కంటి సమస్యలు ఇలా అన్నీ చుట్టుముడతాయి. నిద్ర కావల్సినంత లేకపోయినా...లేదా సుఖమైన నిద్ర కరువైనా ఇదే పరిస్థితి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. నిద్రలేమి అనేది గుండెపోటుకు ఓ కారణమవుతోంది. 


గుండె ఆరోగ్యానికి ఇతరత్రా అంశాలు కూడా ఉన్నాయి. ఇందులో ఫిజికల్ యాక్టివిటీ లేదా వ్యాయామం లేకపోవడం, నికోటిన్ సేవనం అంటే ధూమపానం, సరైన్ డైట్ లేకపోవడం, స్థూలకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ కూడా ఇతర కారణాలుగా ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ ప్రఖ్యాత మెడికల్ జర్నల్‌లో కొన్ని కీలక విషయాలు ప్రచురించింది. ఇందులో స్మోకింగ్, హై కేలరీ డైట్, ఎక్సర్‌సైజ్ లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడాన్ని గుండెపోటుకు కారణాలుగా పేర్కొంది.


కనీసం 7 గంటలు నిద్రలేనివారిలో గుండెపోటు సమస్య అధికంగా ఉండటాన్ని గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నానని ముంబైకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బ్రాయన్ పింటో తెలిపారు. రోజుకు కనీసం 7 గంటలు మంచి నిద్ర కచ్చితంగా ఉండాలంటున్నారు. అదే సమయంలో 8 గంటల కంటే ఎక్కువ నిద్ర మంచిది కాదని కూడా చెబుతున్నారు. అంటే ఆరోగ్యమైన జీవితం కోసం రోజుకు 7-8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. 


ఇండియా సహా చాలా దేశాల్లో గుండెపోటే మరణాలకు నెంబర్ వన్ కారణంగా ఉందని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం చేసిన ఓ అధ్యయనం ప్రకారం..ఇండియాలో ప్రతి లక్షమందిలో 272 మంది ప్రాణాలు కేవలం గుండెపోటుతోనే పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలతో పోలిస్తే..ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షకు గుండెపోటు మరణాలు 235 గా ఉన్నాయి. 


ఎవరైతే రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారో..వారిలో స్థూలకాయం, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ తో పాటు ప్రమాదకరమైన మానసిక రోగాల ముప్పు ఎక్కువగా ఉంటోందని వివిధ అధ్యయనాల్లో తేలింది. నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి అత్యంత అవసరమైంది. నిద్ర లేకపోతే మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 


Also read : Monsoon Diseases: వర్షాకాలంలో ఈ లక్షణాలుంటే..వెంటనే ఆ పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం వద్దు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook