Healthy Lifestyle: ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే చాలు.. శరీర మార్పులు చూసి షాక్ అవుతారు..
Early Morning Drinks: ఈ ఎండాకాలంలో వేడి తాపం తీరడానికి.. ఎప్పటికప్పుడు మంచినీళ్లు తాగుతూ ఉండాల్సి వస్తోంది. వేడివల్ల డిహైడ్రేట్ అయిపోతున్న శరీరానికి.. ఒక చిన్ని గింజల నీళ్లు తీసుకుంటే చాలు.. కేవలం శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాక.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వస్తాయి. మరి ఇంతకీ ఆ గింజలేవో ఒకసారి చూద్దాం..
Chia Seeds Benefits : ఈ వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది. ఈ క్రమంలో చియా గింజలు నీళ్లు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. చియా గింజలు మన శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు.. దానిని తగ్గించడానికి కూడా చియాగింజలు బాగా ఉపయోగపడతాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న చియా గింజలను రాత్రి మొత్తం నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఆ నీళ్లను ఖాళీ కడుపుతో తాగితే.. రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
చియా గింజలని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. రాత్రి మొత్తం చియాగింజలను నానబెట్టిన నీళ్ళని ఉదయం తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందట. చియా గింజలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. పీచు పదార్థం, ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటి ఆక్సిడెంట్లు, క్యాల్షియం, మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ పోతే.. చియా గింజలలో బోలెడు పోషకాలు ఉన్నాయి.
బరువు తగ్గడానికి ఔషధం
ఉదయం చియా గింజల నీళ్లను తాగడం వల్ల.. రోజు మొత్తం ఏం తిన్నా.. చాలా సులువుగా జీర్ణం అవుతూ ఉంటుంది. అందులో ఉండే పీచు పదార్థం వల్ల.. మన శరీరం దాన్ని త్వరగా అరిగించుకోగలదు. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి ఇబ్బందులు కూడా రాకుండా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి చియా గింజలు ఒక దివ్య ఔషధం. ఉదయాన్నే చియాగింజల నీళ్లు తాగడం వల్ల కడుపు కొంచెం నిండుగా అనిపిస్తుంది. దానివల్ల ఎక్కువగా తినబుద్ధి కాదు. కాబట్టి చాలా త్వరగా బరువు తగ్గిపోవచ్చట.
గుండెకి ఎంతో మేలు:
చియా గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని పూర్తిగా తగ్గించేస్తుంది. దానివల్ల మనకు గుండె సంబంధిత సమస్యలు రావు. చియా గింజలు రక్తపోటుని కూడా నియంత్రిస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా గింజల నీళ్లు తాగడం వల్ల ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కంటెంట్ మన శరీరాన్ని అలసిపోనివ్వవు. రోజు మొత్తం హుషారుగా ఉండటానికి చియా గింజల నీళ్లు బాగా ఉపయోగపడతాయి. చియా గింజలలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మన బోన్ దృఢపడేలాగా చేస్తాయి. బోన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకల సమస్యలు రాకుండా దోహదపడతాయి.
చియా గింజలు షుగర్ ను కూడా నియంత్రణలోకి తెస్తాయి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇకనుంచి రోజు ఉదయం లేవగానే.. రాత్రంతా చియా గింజలను నానబెట్టిన నీళ్లు తాగడం మొదలుపెట్టండి. చాలా త్వరగానే.. మీ శరీరంలోని మంచి మార్పులను మీరు చూస్తారు.
Also Read: KTR Challenge: 'లంగలకు పెత్తనం ఇస్తే నెత్తి మీద పెత్తనం చేస్తారు' మోదీ, రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
Also Read: Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది అతడే.. నా మద్దతు అతడికే: అసదుద్దీన్ ఓవైసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter