Heart Attack Reasons: ప్రఖ్యాత టిక్‌టాక్ స్టార్ , బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ పిన వయస్సులోనే గుండెపోటుతో మరణించడం కలవరం కల్గిస్తోంది. తక్కువ వయస్సుకే గుండె పోటు ఎందుకొస్తోంది, యౌవనంలో హార్ట్ ఎటాక్ కారణంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో హార్ట్ ఎటాక్ అంటే వయసు పైబడినవారిలో కన్పించేది. ఆ కారణంగా మరణాలు సంభవించేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పిన వయస్సుకే గుండెపోటు రావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ప్రసిద్ధ టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ కేవలం 42 ఏళ్ల వయస్సుకే హార్ట్ ఎటాక్‌తో మరణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ 58 ఏళ్ల వయస్సులో గుండెపోటుకు గురై..ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్నారు. గత ఏడాది ప్రముఖ టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిద్ధార్ధ శుక్లా 40 ఏళ్లకే గుండెపోటుతో మరణించాడు. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయస్సులో హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పిన వయస్సులో గుండెపోటు మరణాలు ఎక్కువ కావడం ఆందోళన కల్గిస్తోంది. అసలిలా ఎందుకు జరుగుతోంది. కారణాలేంటి..


ఇంత తక్కువ వయస్సులో హార్ట్ ఎటాక్ కేసులు గత కొద్దికాలంగా ఎందుకు పెరిగిపోతున్నాయనేది ప్రధానంగా విన్పిస్తున్న ప్రశ్న. ఆధునిక జీవనశైలి దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, జిమ్‌లో ఎక్కువసేపు గడపడం ముఖ్యమైన కారణాలుగా తెలుస్తోంది. 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సులో సాధారణంగా గుండెపోటు ముప్పు తక్కువగా ఉంటుంది. గతంలో అయితే 50 ఏళ్లు దాటితేనే ఆ సమస్య ఎదురయ్యేది. ప్రస్తుతం 40-45 ఏళ్లకే గుండెపోటు ఘటనలు పెరిగిపోయాయి.


పిన వయస్సులో గుండెపోటు లక్షణాలు


వయస్సు ఏదైనా సరే..హార్ట్ ఎటాక్ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కానీ తక్కువ వయస్సు వారు లక్షణాల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. గుండెపోటు లక్షణాలున్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


ఛాతీలో పట్టేసినట్టుండటం లేదా నొప్పి
చేయి నొప్పి
వేడి లేకపోయినా చెమటలు పట్టడం
అలసట, నీరసం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
కడుపు నొప్పి సమస్య
వాంతులు, అజీర్ణ సమస్య
తల తిరగడం


గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చినప్పుడు మనిషిని బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. కొంతమందికి ఛాతీలో నొప్పి ఉంటుంది. ఇంకొంతమందికి తీవ్రమైన నొప్పి వస్తుంది. మరి కొంతమందికి ఆకస్మిక గుండెపోటు వస్తుంది. కొంతమందిలో గంటల తరబడి లక్షణాలు కన్పిస్తుంటాయి. మీక్కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే..వెంటనే అప్రమత్తం కావల్సి ఉంటుంది. ఛాతీలో నొప్పి లేదా బరువుగా ఉండటం కేవలం హార్ట్ ఎటాక్ లక్షణం ఒక్కటే కాదని కూడా గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో ఇతర కారణాలు కూడా ఉంటాయి. 


పిన వయస్సులో హార్ట్ ఎటాక్ ప్రధాన కారణాలు


హార్ట్ ఎటాక్ కారణాలు కూడా సాధారణంగా ఒకేలా ఉంటాయి. అయితే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తక్కువ వయస్సులో హార్ట్ ఎటాక్ సమస్యకు దారి తీసే కారణాలు ఇవే..




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook