COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Spinach Juice Benefits In Telugu: పాలకూర రసంలో శరీరానికి కావాల్సిన అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో బీటా-కెరోటిన్, ల్యుటీన్, జియక్సాంథిన్ మొదలైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి.    అంతేకాకుండా పాలకూర రసంలో విటమిన్ A, విటమిన్ K, విటమిన్ C, ఫోలేట్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్‌ శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. ఇవే కాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. ఆ ప్రయెజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


పాలకూర రసం తాగడం వల్ల కలిగే 8 లాభాలు:
కళ్ళ ఆరోగ్యం: 

పాలకూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపరచడానికి, గ్లాకోమా వంటి కంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.


రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: 
పాలకూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. అలాగే సీజన్‌ అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 


గుండె ఆరోగ్యానికి: 
పాలకూరలో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది హోమోసిస్టైన్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు తీవ్ర గుండె సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


రక్తహీనత నివారణ: 
పాలకూరలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. తరచుగా మహిళలు రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నవారు తప్పుకుండా పాలకూర రసాన్ని తాగాల్సి ఉంటుంది. 


క్యాన్సర్ నిరోధకం:
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు పాలకూర రసం తాగడం వల్ల అనేక క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి.


బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
పాలకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.