Sprouts on Empty Stomach: మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొలకెత్తిన పప్పు లేదా మొలకెత్తిన ధాన్యాలు వంటి పోషకాహారాన్ని అధికంగా తింటే.. శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని ఉదయాన్నే తినడం వల్ల శరీరంలోని అజీర్ణం సమస్య తగ్గడం సహా రోగనిరోధక వ్యవస్థ మెరుగయ్యేందుకు సహాయపడుతుంది. మొలకెత్తిన విత్తనాల్లో ఉండే పీచు పదార్థం ఉదర సమస్యలను దూరం చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొలకెత్తిన పప్పుధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఐరన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, విటమిన్ ఎ, బి, విటమిన్ సి, విటమిన్ ఇ ఉన్నాయి. ఇందులో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే మొలకెత్తిన విత్తనాల వల్ల ఏఏ లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. 


బలంగా రోగనిరోధక వ్యవస్థ


మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మొలకలు తినవచ్చు. మొలకెత్తిన గింజల్లోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.


ఉదర సమస్యలకు ఉపశమనం


ఉదర సమస్యలలో కూడా మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. చిక్కుళ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటితో పాటు పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.


గుండెకు ఆరోగ్యం


మొలకెత్తిన విత్తనాలు ఉదయాన్నే తీసుకోవడం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.


బరువు తగ్గేందుకు


బరువు తగ్గడానికి, మొలకెత్తిన విత్తనాలను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. మొలకెత్తిన శనగల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.


(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధరణ సమాచారం ఆధారంగా పొందుపరిచింది. ఈ చిట్కాలను పాటించే ముందు ఒకసారి వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)


Also Read: Corriandor Seeds: ధనియాల నీటితో ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు


Also Read: Fatigue: ఆహారపు అలవాట్లు ఇలా మార్చుకుంటే చాలు, అలసట దూరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.