Fatigue: ఆరోగ్యమే మహాభాగ్యం. సరైన ఆహారపు ఆలవాట్లతో ఆరోగ్యాన్ని కచ్చితంగా సంరక్షించుకోవచ్చు. అదే ఆహారపు అలవాట్ల కారణంగా అలసట ప్రధాన సమస్యగా ఉంటోంది. ఆ అలసటను ఎలా దూరం చేసుకోవాలో చూద్దాం.
ఆధునిక జీవన శైలిలో వస్తున్న మార్పుల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోని పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా రోజువారీ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చేశాయి. బలవర్ధకమైన ఆహార పదార్ధాల్లో స్థానంలో జంక్ ఫుడ్స్ వచ్చి చేరాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు సాధారణంగా మారాయి. ఈ క్రమంలో కొంతమందిలో ఎంత పని చేసినా చురుకుదనం కన్పిస్తుంది. ఇంకొంతమందిలో చిన్నపనులకే తీవ్ర అలసట కన్పిస్తుంది. దీనికి కారణాలేంటో పరిశీలిద్దాం.
చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వంశ పారంపర్యంగా వస్తున్న హార్మోన్ల అసమతుల్యత, కండరాల్లో కొవ్వు తీవ్రతలు ప్రధానమైనవి. అయితే ఈ రెండింటినీ ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జీర్షక్రియ సరిగ్గా లేకపోవడం అలసటకు ప్రధాన కారణంగా ఉంది. ఆహారం సరైన పద్ధతిలో జీర్ణమైతే ఒంటికి మంచి శక్తి వస్తుంది. అందుకే జీర్ణ ప్రక్రియ మెరుగుపడేందుకు సాధ్యమైనంత ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకపూట ఆకుకూరలు తినడం మంచిది. ఆకుకూరల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కూరల్లో ప్రధానంగా కొత్తిమీర, అల్లం, జీలకర్రను ఎక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఒక అరటిపండు, ఒక గ్లాసు పాలు తీసుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలేవీ తలెత్తవు. తిండి సమయానికి తీసుకోవాలి. లేకపోతే శరీరానికి కావల్సిన ఎనర్జీ లభించదు.
ఇక కొవ్వున్న ఆహారపదార్ధాల్ని(Food Habbits) ఎంత మానేస్తే అంత మంచిది. జంక్‌ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదు. జంక్‌ఫుడ్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువై..రక్త ప్రసరణలో తేడా వస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే బరువు కూడా పెరుగుతారు. అందుకే జంక్‌ఫుడ్‌ను దూరం చేయక తప్పదు. అలసటకు (Fatigue) దూరంగా ఉండాలంటే..టైమ్లీ ఫుడ్, పండ్లరసాలు, ఆకుకూరలు తగిన పరిమాణంలో తీసుకోవడం అవసరం.
Also read: White Hair Problem: ఆ ఒక్కటీ దూరమైతే..జుట్టు తిరిగి నల్లబడుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook