Stomach Cleaning Juices: ఈ కాలంలో అందరూ బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఫుడ్‌ అలవాట్లను ఆరోగ్యకరంగా ఉంచుకవట్లేదు. దీంతో కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అజీర్తి, ఛాతిలో మంట, మలబద్ధకం సమస్యలతో సతమతమవుతారు. ఇది అతిగా మసాలాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ప్రధాన కారణం. కొంతమందికి కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల, ఎప్పటికప్పుడు క్లీన్ ఉండకపోవడం జరుగుతుంది. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదొర్కొనేవారికి కొన్ని హోం రెమిడీలు ఉన్నాయి. దీంతో మీ పొట్ట శుభ్రం అయిపోతుంది. ఆ జ్యూసులు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాము నీళ్లు..
వెబ్‌ఎండీ ప్రచురించిన నివేదికల ప్రకారం వాము నీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కడుపులో నొప్పి, గ్యాస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. అంతేకాదు ఈ వామునీటిని క్రమంతప్పకుండా వాడటం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఇది తోడ్పడుతుంది. ఉదయం ఖాళీ కడుపున వాము నీటిని తాగడం వల్ల విశేష ప్రయోజనాలు ఉంటాయి.


జిలకర్ర నీరు..
జిలకర్ర నీటిని క్రమంతప్పకుండా మన డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జిలకర్ర నీటితో గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్యకు చెక్‌ పెడతాయి.  ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికకు సహాయపడుతుంది.


నిమ్మకాయ, తేనె..
ఉదయం పరగడుపున నిమ్మకాయ, తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో కడుపు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. నిమ్మకాయ, తేనె కలిపిన నీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు నిమ్మకాయ నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది కడుపును ఒక్కసారిగా శుభ్రం చేస్తాయి. ఇది బరువు తగ్గించడంతో పాటు మన శరీర ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.


ఇదీ చదవండి:  ఉడకబెట్టిన పల్లీలు తింటే ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే కళ్లు చెదిరే లాభాలు..


ఫైబర్..
ముఖ్యంగా ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు మన డైట్లో చేర్చుకుంటే జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఫైబర్‌ అధికంగా ఉండే క్యారట్లు, ఓట్స్‌, గ్రీన్‌ పీ, బీన్స్‌, యాపిల్స్‌, స్ట్రాబెర్రీలు ఆహారంలో చేర్చుకోవాలి. దీంతో పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మలబద్ధకం సమస్యలకు కూడా చెక్‌ పెడతాయి. 


కలబంద జ్యూస్..
కలబంద జ్యూస్‌ సహజసిద్ధమైన జ్యూస్‌ ఇది కడుపు సమస్యలైన మలబద్ధకం సమస్యలకు చెక్‌ పెడుతుంది. దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్యలతో పోరాడేవారు కలబంద జ్యూస్‌ను డైట్లో చేర్చుకోవాలి. మొదట్లో కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఆ తర్వాత కలబంద జ్యూస్‌ మోతాదును పెంచాలి. ఈ కలబంద జ్యూసులను డైట్లో చేర్చుకుంటే కడుపు సమస్యలకు చెక్‌ పెడుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


ఇదీ చదవండి:  జామపండుతో 5 ఆరోగ్య ప్రయోజనాలు.. కేన్సర్‌కు చెక్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter