Sugarcane Juice Benefits: వేసవిలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
Sugarcane Juice Benefits: వేసవిలో ఎండల నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు మనలో చాలా మంది పండ్ల రసాలు లేదా చెరకు రసాన్ని తాగుతుంటారు. అయితే చెరకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? చెరకు రసం శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Sugarcane Juice Benefits: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పండ్ల రసాలు, కొబ్బరి నీరు, ఎక్కువగా నీరును తాగడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. కొబ్బరి నీరు, చెరకు రసం వంటి పానీయాలతో శరీరంలోని వేడిమి తగ్గిపోతుంది.
కానీ, చెరకు రసంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక ప్రయోజనాలను దక్కించుకోవచ్చు. ఎందుకంటే చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఈ క్రమంలో చెరకు రసం తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో తెలుసుకుందాం.
చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
1) వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అలాంటి ఉత్తమ పోషకాలను అందించడంలో చెరకు రసం ఎంతో తోడ్పడుతుంది.
2) తీవ్ర ఎండల ధాటికి వడదెబ్బ బారిన పడిన వారికి.. జ్వరం వచ్చిన వారికి చెరకు రసం ఔషధం లాగా పనిచేస్తుంది. వారితో చెరకు రసాన్ని తాగిస్తే.. శరీరానికి కావాల్సిన షుగర్, ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్ వంటివి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
3) శొంఠితో కానీ.. అల్లంతో కానీ చెరకు రసాన్ని కలిపి ఇస్తే.. వెక్కిళ్లు, జాండిస్ తగ్గుతాయి. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కడుపు నొప్పి, కిడ్నీ, గుండె, కళ్లు, బ్రెయిన్ కు ఎంతో మేలు కలుగుతుంది.
4) చెరకు రసంతో పాటు చెరకు గడను కూడా తినడం వల్ల పళ్లు, దవడలు గట్టి పడతాయి. ఒక గ్లాస్ చెరకు రసంలో 75 శాతం నీరు ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరానికి తగిన నీరు శాతం అందించినట్లు అవుతుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Weight Loss Tips: ఇలా చేస్తే జిమ్ కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే బరువు తగ్గొచ్చు!
Also Read: White Hair Solution: తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook