Summer Foods: భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న వేడిని నివారించడానికి ఇంట్లో ఎయిర్ కూలర్లు లేదా ఏసీలను తెచ్చుకోవడం సహా చల్లని పానీయాలను తాగుతున్నారు. తద్వారా వేసవిలో ఎండల తాపాన్ని తట్టుకోవచ్చు. అయితే శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ వేడి అందితే అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవిలో ఆహారం పట్ల జాగ్రత్త!


వేసవి కాలంలో మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే దాని చెడు ప్రభావం మన కడుపుపై ​​కనిపిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచే ఆ ఆహారపదార్థాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. తద్వారా ఉష్ణోగ్రత పెరిగినా కడుపుపై చెడు ప్రభావం ఉండదు.


శరీరం చల్లబడేందుకు..


1. పెరుగు


మనం రోజూ తినే ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పెరుగును అనేక రకాలుగా తినొచ్చు. ఇది వేసవి కాలంలో పొట్టను చల్లబరుస్తుంది. దీని వల్ల ఉదర సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీరు నేరుగా పెరుగు తినవచ్చు లేదా మజ్జిగ లేదా లస్సీ తయారు చేసిన తర్వాత త్రాగవచ్చు.


2. దోసకాయ


దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దానిలో అధిక నీరు ఉంటుంది, దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఉండదు. దోసకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. మీరు దీన్ని నేరుగా లేదా సలాడ్‌గా తినవచ్చు.


3. పొట్లకాయ


పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. కడుపు సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. ఈ క్రమంలో దీన్ని వండేప్పుడు నూనె ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి. పొట్లకాయ రసం తాగితే మంచి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. 


4. పుదీనా


పుదీనాను వేసవిలో మంచి ఆహారంగా పరిగణిస్తారు. పుదీనా తీసుకోవడం వల్ల శరీరంలో చల్లని ప్రభావం ఏర్పడుతుంది. నిమ్మకాయ నీళ్లలో కలిపి తాగడం వల్ల తాజాదనం వస్తుంది. అలాగే దీని చట్నీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.


5. ఉల్లిపాయలు


ఉల్లి అనేక వ్యాధులకు దివ్యౌషధం అని చెబుతారు. పచ్చి ఉల్లిపాయను తినడం ద్వారా హీట్ స్ట్రోక్ నివారించవచ్చు. దీని కూల్ ఎఫెక్ట్ వల్ల వేసవిలో శరీరానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని సలాడ్‌గా తింటే మంచిది.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Jamun Side Effects: నేరేడు పళ్లు అతిగా తింటే ఎన్ని అనర్థాలో తెలుసా..??


Also Read: onion hair growth tips: మీ జుట్టు రాలుతుందా..అయితే ఈ సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook